గురువారం, జూన్ 11, 2026
వినోదం

హ‌నీరోజ్‌కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసిందా.. ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు.. వీడియో..

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి చిత్రంలో న‌టించి ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది హ‌నీరోజ్. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయిన హనీరోజ్‌ 14 ఏళ్ల క్రితమే ఓ తెలుగు సినిమాలో క‌నిపించింది.. అయితే ఈ విషయం చాలామందికి…

హ‌నీరోజ్‌కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసిందా.. ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు.. వీడియో..

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి చిత్రంలో న‌టించి ఒక్క‌సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది హ‌నీరోజ్. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల క్రష్‌గా మారిపోయిన హనీరోజ్‌ 14 ఏళ్ల క్రితమే ఓ తెలుగు సినిమాలో క‌నిపించింది.. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ సినిమా పేరు ఆలయం. సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాజీ హీరోగా నటించ‌గా, ఈ చిత్రాన్ని ట్రెండ్ సెట్ ఫిలింస్ పతాకంపై అనూప్ చక్రవర్తి నిర్మించారు. అయితే ఈ సినిమా ప్లాప్‌ కావడంతో హనీరోజ్‌కు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. 2014 లో వరుణ్‌ సందేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో మెరిసింది.

ఆ చిత్రం కూడా పెద్ద‌గా ఆడ‌క‌పోయే స‌రికి పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు రాలేదు. ఈ అమ్మ‌డు మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నిరోజుల క్రితం విడుదలైన మోహన్‌లాల్‌ మాన్‌స్టర్‌ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించింది. కేరళలోని ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన హనీరోజ్.. తండ్రి పేరు థామస్ కాగా తల్లి పేరు రోజ్‌. 15 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రం లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వీర‌సింహారెడ్డి చిత్రంతో హ‌నీరోజ్ పేరు ప్ర‌ఖ్యాత‌లు అమాంతం పెరిగాయి.

honey rose got hug fan following see what happened viral video

తాజాగా కేరళ మన్నార్ కడ్ లోని ఓ హోమ్ అప్లయన్సెస్ షోరూం ఓపెనింగ్ కు గెస్ట్ గా వెళ్లిన హ‌నీరోజ్‌ని అక్క‌డ అభిమానులు న‌లిపి వేశారు. హనీరోజ్ వ‌స్తుంద‌ని తెలిసి చుట్టు ప‌క్క‌ల నుండి యువ‌త భారీగా వ‌చ్చారు. హనీరోజ్ కోసం వచ్చిన వేలాదిమంది జనాన్ని చూసి పోలీసులు, బౌన్సర్లు షాకయ్యారు. సదరు జనాన్ని కంట్రోల్ చేయడానికి వారు ప‌డ్డ తిప్పులు అన్నీ ఇన్నీ కావు. హనీరోజ్ తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. అలా ఓసారి ఆమెపై పడిపోయారు. వారంద‌రిని దాటుకుంటూ వ‌చ్చి ఎలాగోలా కారెక్కి ఇంటికి వెళ్లిన హనీరోజ్.. ఈ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీన్ని చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి