Nithin : చిరంజీవికి, నితిన్ భార్య షాలిని కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

September 10, 2022 10:11 PM

Nithin : కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా పేరును సొంతం చేసుకొని, మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడం కోసం అనేక చిత్రాల్లో నటించి బోల్తా పడ్డాడు నితిన్. ఆ తర్వాత ఇష్క్ చిత్రంతో మళ్లీ తన కెరీర్ లో లవర్ బాయ్ గా సక్సెస్ ను అందుకున్నాడు. నితిన్ గత కొంత కాలంగా వరుస చిత్రాల ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం కూడా నితిన్ కి సరైన సక్సెస్ ను అందించలేకపోయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. కానీ ప్రేక్షకులలో నితిన్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఇష్క్ సినిమా సమయంలో నితిన్ కి మరియు షాలినికి మధ్య ఒక స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడింది. వీళ్ళ ప్రేమ విషయం పెళ్లి పీటల దాకా వచ్చే వరకు ఎవరికీ బయటకు తెలియకుండా చాలా సీక్రెట్ గా మెయింటెన్ చేశాడు నితిన్. ఇక ఇరువురు తల్లిదండ్రుల అనుమతితో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో నితిన్ జూలై 26, 2020 సంవత్సరంలో అతి తక్కువ కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల సాక్షిగా ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి భార్య షాలినితో కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ భార్య గురించి ఒక విషయం బయటకు వచ్చింది. షాలిని చిరంజీవి కుటుంబానికి సన్నిహితురాలనే విషయం బయటకు తెలుస్తుంది.

do you know about the relation between nithin wife family and chiranjeevi
Nithin

అది ఎలా అంటే షాలిని తల్లిదండ్రులది సంపత్ మరియు నూర్జహాన్ లది కూడా ప్రేమ వివాహమే. షాలిని తల్లిదండ్రులిద్దరూ 20 సంవత్సరాలుగా కర్నూల్ లో ఫేమస్ డాక్టర్స్ గా కొనసాగుతూ అక్కడే ప్రగతి నర్సింగ్ హోమ్ కూడా నిర్వహిస్తున్నారు. 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున షాలిని తల్లి నూర్జహాన్ ను కర్నూలు నియోజకవర్గంలో నిలబెట్టారు చిరంజీవి. నూర్జహాన్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఇక ఆ సమయం నుంచి చిరంజీవికి మరియు షాలిని తల్లిదండ్రులకు మంచి స్నేహం ఏర్పడింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment