విడాకుల తర్వాత తొలిసారిగా ఒక్కటిగా కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య.. మళ్లీ కలిసిపోయారా..?

August 23, 2022 5:14 PM

కోలీవుడ్‌లో స్టార్‌ జంటగా ఉన్న ధనుష్‌ – ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా ? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌ మీడియా ఖాతాల్లో పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన సందర్భాలు లేవు. కాకపోతే తన ఇద్దరు కుమారులను తీసుకొని ధనుష్‌ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు.

ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్ ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో.. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.. అంటూ సోమవారం ఓ ఫోటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది.

Dhanush and Aishwarya Rajnikanth met each other in a program

అందులో ధనుష్‌, ఐశ్వర్య.. తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో సెల‌బ్స్ విడిపోయినా కూడా పిల్ల‌ల కోసం కొన్ని సంద‌ర్భాల‌లో క‌లుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ధనుష్‌- ఐశ్వ‌ర్య క‌లిసి క‌ట్టుగా క‌నిపించారు. ఇక ధనుష్‌ తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఐశ్వర్య రజనీకాంత్‌.. డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతుంది. హిందీలో ఓ సాథీ చల్‌ అనే ప్రేమకథా చిత్రాన్ని ఆమె డైరెక్ట్ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment