గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Betel Leaves : ఈ ఆకుల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Betel Leaves : పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటం ఇలా దేనికైనా సరే మన భారత సంస్కృతిలో తమలపాకుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకోవడం పూర్వీకుల  కాలం నుంచి వస్తోంది. ఈ…

Betel Leaves : ఈ ఆకుల‌ను అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Betel Leaves : పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటం ఇలా దేనికైనా సరే మన భారత సంస్కృతిలో తమలపాకుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకోవడం పూర్వీకుల  కాలం నుంచి వస్తోంది. ఈ ఆకు ఆరోగ్యానికి రక్ష అని పెద్దలు అంటుంటారు. తమలపాకును  పాన్ కా పట్టా అని కూడా అంటారు.  తమలపాకు సుగంధాల మేళవింపుతో మంచి రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ ఆకులు అనేక పోషకాల ఉంటాయి.

తమలపాకును సంస్కృతంలో తాంబూలీ, నాగవల్లి, భక్షపత్ర అని కూడా అంటారు. ఇవి వగరు, కారం, తీపి రుచులు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అధిక వేడి చేయకుండా  శరీరాన్ని సమశీతోష్ణస్థితిలో ఉంచుతాయి. శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేయడంలో తమలపాకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు తమలపాకు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Betel Leaves benefits do not leave them
Betel Leaves

 తమలపాకులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్, సి విటమిన్ లు  పుష్కలంగా ఉంటాయి. తమలపాకును తాంబూలంగా తీసుకోవడం వలన  రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని ఫైబర్  చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతకంటే ఎక్కువగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.

ఐదు లేత తమలపాకులను ముద్దగా నూరి ఒక కప్పు వేడి నీళ్లలో వేసి కలిపి కొద్దిగా ఉప్పు చేర్చి తాగితే బొదకాలు వ్యాధి నయమవుతుంది. అయితే దీనికి ముందుగా ఆయుర్వేద వైద్యుల సూచన తీసుకోవడం ఉత్తమం. అలాగే తమలపాకు తొడిమలను దంచి రసం తీసి రోజూ ఉదయం పూట కళ్ళలో ఒకటి రెండు చుక్కల రసం వేస్తూ ఉంటే క్రమంగా కంటి దురదలు, కురుపులు, నొప్పులు మాత్రమే కాకుండా రేచీకటి కూడా తొలగిపోయి మంచి చూపు వస్తుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇక తమలపాకు రసాన్ని తీసి వారానికి రెండు మూడు సార్లు ఒక పావు టీ స్పూన్ తమలపాకు రసంలో మరో పావు టీ స్పూన్  తేనె కలిపి పిల్లలకి పట్టిస్తే జలుబు, దగ్గు వంటివి దూరం అవుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా చంటి పిల్లలకైతే రెండు చుక్కల తమలపాకు రసాన్ని పట్టిస్తే ఉబ్బసం నయమవుతుందని ఆయుర్వేద నిపుణులు నిపుణులు వెల్లడిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి