ఆదివారం, జూలై 5, 2026
వార్తలు

Aha OTT : బాల‌కృష్ణ త‌ర్వాత హోస్ట్‌గా మార‌బోతున్న మ‌రో సీనియ‌ర్ న‌టుడు..!

Aha OTT : ఇన్నాళ్లూ వెండితెరపై అల‌రించిన హీరోలు ఇప్పుడు బుల్లితెర‌పై స‌త్తా చాటుతున్నారు. ఓటీటీ రంగంలో కూడా అడుగుపెడుతున్నారు. తొలి తెలుగు ఓటీటీ ఆహా.. టాక్ షోల‌తో స‌రికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్ట‌గా, ఆ మ‌ధ్య స‌మంత…

Aha OTT : బాల‌కృష్ణ త‌ర్వాత హోస్ట్‌గా మార‌బోతున్న మ‌రో సీనియ‌ర్ న‌టుడు..!

Aha OTT : ఇన్నాళ్లూ వెండితెరపై అల‌రించిన హీరోలు ఇప్పుడు బుల్లితెర‌పై స‌త్తా చాటుతున్నారు. ఓటీటీ రంగంలో కూడా అడుగుపెడుతున్నారు. తొలి తెలుగు ఓటీటీ ఆహా.. టాక్ షోల‌తో స‌రికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్ట‌గా, ఆ మ‌ధ్య స‌మంత సామ్ జామ్ అనే షో చేసింది. ఇప్పుడు బాల‌కృష్ణ రంగంలోకి దిగుతున్నాడు. న‌వంబ‌ర్ 4 నుంచి ప్ర‌సారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొని ఉంది.

another senior actor is going to host talk show in Aha OTT

ఆహా టాక్ షో కోసం బాల‌య్య బాబు ఏకంగా రూ. 40 ల‌క్ష‌లు తీసుకోనున్నాడ‌నేది స‌మాచారం. తొలి సీజ‌న్‌లో 12 ఎపిసోడ్‌లు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. అంటే ఎంత కాద‌న్నా ఈ షో కోసం బాల‌కృష్ణ రూ. 5 కోట్లు తీసుకోనున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక బాల‌కృష్ణ త‌ర్వాత మ‌రో సీనియర్ ఆహా కోసం హోస్ట్‌గా మార‌బోతున్న‌ట్టు స‌మాచారం. వెండితెర‌పై వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి క‌లెక్ష‌న్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు మోహ‌న్ బాబు.

త్వ‌ర‌లో మోహ‌న్ బాబు ఆహా టాక్ షో కోసం హోస్ట్‌గా మార‌బోతున్నాడని అంటున్నారు. ప‌లువురిని త‌న‌దైన స్టైల్‌లో ఇంట‌ర్వ్యూలు చేసి అంద‌రినీ అల‌రించ‌నున్నారని టాక్. దీనిపై అతి త్వ‌ర‌లోనే పూర్తి క్లారిటీ రానుంది. మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం స‌న్ ఆఫ్ ఇండియా అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి