Anchor Varshini : బూరెల బుట్ట‌లో ప‌డ్డ వ‌ర్షిణి.. కోట్ల‌కు అధిప‌తి అయిన వ్య‌క్తితో పెళ్లి..?

October 2, 2022 2:05 PM

Anchor Varshini : బుల్లితెరపై స్టార్ యాంకర్స్ గా రాణిస్తున్న వయ్యారి భామల‌లో వర్షిణి కూడా ఒకరు. తనదైన శైలిలో అందంతో, ఫుల్ జోష్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. పలు టీవీ షోల‌లో యాంకర్ గా చేసిన వర్షిణి.. హీరోయిన్ గా కూడా ఒకటి రెండు చిత్రాలలో  నటించింది. కానీ వెండితెరపై నటనపరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వెండితెరపై ఏమాత్రం గుర్తింపు రాకపోయినా.. బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఏమైందో ఏమో గానీ గత కొంతకాలంగా వర్షిణి బుల్లితెరపై కూడా ఎక్కువగా కనిపించడం లేదు.

తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్షిణిపై ఇప్పుడు ఒక విషయం బాగా వైరల్ గా మారింది. యాంకర్ వర్షిణి పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆమెను పెళ్ళాడబోయే వరుడు ఎవరో తెలుసా..?

Anchor Varshini reportedly getting marriage
Anchor Varshini

వెండి తెరను, బుల్లితెరను ఏలేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వర్షిణికి కాలం కలిసిరాక సినిమాలలోనూ, బుల్లితెర పైన తన సత్తాను చాటుకోలేకపోయింద‌ని చెప్పవచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అందాలు ఒలకబోసిన కూడా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే ఇక అన్నింటికీ పుల్ స్టాప్ పెట్టి పెళ్ళి చేసుకోవాలి అనుకుంటుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అంతేకాకుండా వర్షిణి కోటీశ్వరుల ఇంటి కోడ‌లు కాబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బంధువుల సంబంధం అని బుల్లితెర ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇక బుల్లితెర నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ చివరి వారంలో వర్షిణి నిశ్చితార్థం  జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో వర్షిణి పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త ప్రచారం అవుతుంది. అయితే వర్షిణి పెళ్లి చేసుకోబోయేది తన సొంత బావనే అట‌. అతను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తెలుస్తుంది. అతనికి కోట్లల్లో ఆస్తులు కూడా ఉన్నాయట. ఇక ఆస్తి మొత్తానికి ఒక్కడే వారసుడు కావడంతో.. వర్షిణి బూరెల బుట్ట‌లో పడిందని, కోట్ల ఆస్తికి వర్షిణి వారసురాలు కాబోతుందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment