Hyper Aadi : ప్రేమ‌లో ప‌డిన హైప‌ర్ ఆది, యాంక‌ర్ వ‌ర్షిణి..? చివ‌రి వ‌ర‌కు నాతోనే ఉండు.. అంటూ వ‌ర్షిణి పోస్ట్‌..!

June 10, 2022 1:46 PM

Hyper Aadi : వెండితెర‌పైనే కాదు.. బుల్లితెర‌పై కూడా.. ఇప్ప‌టికే చాలా మంది న‌టీన‌టులు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇది స‌హ‌జ‌మే. అయితే కొంద‌రు ఉన్న‌ట్లుండి త‌మ ప్రేమ‌కు సంబంధించిన విష‌యాల‌ను తెలియ‌జేయ‌డం సంచ‌ల‌నంగా మారుతోంది. తాజాగా హైప‌ర్ ఆది, యాంక‌ర్ వ‌ర్షిణి ఇలా చేశారు. యాంక‌ర్ వర్షిణి అయితే హైప‌ర్ ఆదిని ప్రేమిస్తున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పింది. దీంతో అస‌లు ఆమె ఆ పోస్ట్ ఎందుకు పెట్టిందా.. అని నెటిజ‌న్లు తెగ ఆలోచిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

జ‌బ‌ర్దస్త్ వేదిక‌పై హైప‌ర్ ఆదికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే కొన్నాళ్లుగా ఆది ఆ షోలో క‌నిపించ‌డం లేదు. శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షోలో మాత్ర‌మే వ‌స్తున్నాడు. ఇక యాంక‌ర్ వ‌ర్షిణితో క‌ల‌సి గతంలో ఆది ఢీ స్టేజిపై సంద‌డి చేశాడు. అయితే ఆది బ‌ర్త్ డే సంద‌ర్భంగా యాంక‌ర్ వ‌ర్షిణి అత‌నికి శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదు. కానీ ఆ బ‌ర్త్ డేను వీరిద్ద‌రూ ప్ర‌యివేట్‌గా జ‌రుపుకున్నారు. ఇదే ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

Anchor Varshini celebrated Hyper Aadi birth day
Hyper Aadi

ఇక ఆది బ‌ర్త్ డే సంద‌ర్భంగా వ‌ర్షిణి ఒక పోస్ట్ పెట్టింది. అందులో వారిద్ద‌రే ఉన్నారు. బ‌ర్త్ డేను సెల‌బ్రేట్ చేసిన వీడియోతో ఆమె ఒక కామెంట్ కూడా పెట్టింది. అందులో వ‌ర్షిణి ఏం చెప్పిందంటే.. డియ‌ర్ ఆది.. నీకు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు.. నా జీవితంలో చివ‌రి వ‌ర‌కు నువ్వు నాతోనే ఉండాల‌ని కోరుకుంటున్నా.. నువ్వు నాకు అత్యంత ఇష్ట‌మైన వ్య‌క్తివి.. తెల్ల‌వారు జామున 3 గంట‌ల‌కు అందుబాటులో ఉండే స్నేహితుడివి.. న‌న్ను నువ్వు ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తున్నావు.. రైట‌ర్ ఆది.. నువ్వు నాకు రైట్ రా ఆది.. అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

హైప‌ర్ ఆది, యాంక‌ర్ వ‌ర్షిణిలు ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌నే విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అందుకు కార‌ణం ఆమె ఆ పోస్టును పెట్ట‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇది తెర‌పై కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనే జ‌రిగింది. పైగా వ‌ర్షిణి పోస్ట్ కూడా పెట్టింది. క‌నుక వీరి ల‌వ్ క‌న్‌ఫామ్ అనే తెలుస్తోంది. మ‌రి దీనిపై వారు ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Varshini (@varshini_sounderajan)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment