Suma : సుమ కూడా అనేసిందిగా.. దేవి నాగ‌వ‌ల్లి గెట‌వుట్ డైలాగ్‌ను వాడేసింది..!

May 22, 2022 10:35 PM

Suma : విశ్వ‌క్‌సేన్‌తో యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి గొడ‌వ పెట్టుకోవ‌డం ఏమోగానీ.. ఆయ‌న సినిమాకు విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ వ‌చ్చేసింది. ఓ ద‌శ‌లో విశ్వ‌క్‌సేన్ రియ‌ల్ హీరో అయ్యాడు. ఆయ‌న‌కే నెటిజ‌న్లు మ‌ద్ద‌తుగా నిలిచారు. దేవి నాగ‌వ‌ల్లి చేసిందే త‌ప్ప‌ని చాలా మంది ఆమెను విమ‌ర్శిస్తూ ట్రోల్ చేశారు. అయితే ఇప్ప‌టికి ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. కానీ ఆమెపై ట్రోల్స్ మాత్రం ఆగ‌డం లేదు. అస‌లు విష‌యం ఏదైన‌ప్ప‌టికీ మ‌ధ్య‌లోకి దేవి నాగ‌వ‌ల్లిని తీసుకువ‌స్తూ ఆమెను ట్రోల్ చేయ‌డం మొద‌లు పెడుతున్నారు. ఇక ఇటీవ‌లే జ‌బ‌ర్ద‌స్త్ షోలోనూ దేవి నాగ‌వ‌ల్లి టైప్ లో పొట్టి నరేష్ గెట‌వుట్ అంటూ సంద‌డి చేశాడు. ఆమెను ఇలా వాడేస్తున్నారు.

కాగా కేవ‌లం పొట్టి న‌రేష్ మాత్ర‌మే కాదు.. దేవి నాగ‌వ‌ల్లి గెట‌వుట్ అనే డైలాగ్‌ను చాలా మంది ఊత‌ప‌దంగా కూడా మార్చుకున్నారు. చాలా మంది ఆ డైలాగ్‌తో ఆమెను ఇప్ప‌టికీ ట్రోల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన క్యాష్ షో ప్రోమోలోనూ దేవి నాగ‌వ‌ల్లి డైలాగ్‌ను సుమ ఇమిటేట్ చేసింది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు డేగ‌ల బాబ్జీ టీమ్ హాజ‌రు కాగా.. వారిలో బండ్ల గ‌ణేష్, స‌మీర్ త‌దిత‌రులు ఉన్నారు. అయితే ఓ ద‌శ‌లో స‌మీర్‌ను ఉద్దేశించి సుమ‌.. గెట‌వుట్ అని యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లి డైలాగ్‌ను చెబుతుంది. దీంతో స‌మీర్ కూడా మీరు న‌న్ను ఎలా బ‌య‌టకు పంపిస్తారు ? అని ప్ర‌శ్నిస్తాడు.

anchor Suma used Devi Nagavalli getout dialogue
Suma

చివ‌ర‌కు బండ్ల గ‌ణేష్ క‌ల‌గ‌జేసుకుని.. ఈటీవీ శాశ్వ‌తం.. క్యాష్ షో శాశ్వ‌తం.. సుమ శాశ్వ‌తం కాదు.. అంటూ డైలాగ్ కొడ‌తాడు. దీంతో షోలో న‌వ్వులు విర‌బూశాయి. కాగా ఈ ప్ర‌త్యేక‌మైన ఎపిసోడ్ ఈ నెల 28వ తేదీన ప్ర‌సార కానుంది. ఈ ప్రోమోను చూస్తే క్యాష్ లేటెస్ట్ ఎపిసోడ్ నవ్వుల‌ను పంచుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ మ‌ధ్యే జ‌బ‌ర్ద‌స్త్ షోలోనూ న‌రేష్ గెట‌వుట్ అనే డైలాగ్‌ను వాడి అంద‌రికీ న‌వ్వు తెప్పించాడు. దేవి నాగ‌వ‌ల్లి ఇలా గొడ‌వ‌లో ఇరుక్కోవ‌డం ఏమోగానీ.. ఆమెను ప‌దే ప‌దే ఇలా ఆమె వాడిన డైలాగ్‌తో టార్గెట్ చేస్తున్నారు. ఇక చివ‌ర‌కు ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment