Anchor Suma : ఇండస్ట్రీకి సుమ గుడ్ బై..? అంత సీరియస్ ప్రాబ్ల‌మ్ తో బాధపడుతుందా..?

September 30, 2022 8:15 PM

Anchor Suma : రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరలోకి అడుగు పెట్టింది యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ చేస్తుంటుంది సుమ. సుమ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరు. అందరినీ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంది. ఒక రకంగా సుమ కోసమే కొందరు ఈవెంట్ చూస్తారు అంటే నమ్మశక్యం కాదు. ఏళ్లకి ఏళ్లుగా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ బిగ్ ఈవెంట్ హోస్ట్ కావడంతో టాప్ దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్‌ని ఇష్టపడతారు.

ఇంకా చెప్పాలంటే సుమ హోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఎక్కడికక్కడ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటూ చెరగని ముద్ర వేయించుకుంది యాంకర్ సుమ. అయితే త్వరలోనే సుమ సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు దూరం కావాలనుకుంటుంది.. అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో సుమ ఆరోగ్యం కొంచెం ట్రబుల్ ఇస్తుందట. తెరపై చలాకీగా మాట్లాడుతున్నా, గలగలా నవ్వుతూ యాంకరింగ్ చేస్తున్నా.. ఇన్నర్ గా ఆమె ఆరోగ్యం బాగోలేదట.

Anchor Suma reportedly saying good bye to film industry
Anchor Suma

ఆమె ఆడవాళ్లకు సంబంధించిన ఓ ప్రాబ్లంతో బాధపడుతుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు దీని కోసం డాక్టర్స్ ఎక్కువసేపు నిలబడకూడదని.. రెస్ట్ తీసుకోవాలని, హడావిడిగా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరగకూడదని.. ఆమెకు సూచించారట. అలా ఆమె ఇప్పటి నుంచి తన ఆరోగ్యంపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఈ ప్రాబ్లం కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్లు డాక్టర్ చెప్పారట. దీంతో ఇప్పటి వరకు కమిట్ అయిన షూటింగ్స్ ఈవెంట్స్ కు యాంకరింగ్ చేసి.. ఆ తర్వాత తన యాంకరింగ్ లైఫ్ కి గుడ్ బై చెప్పాలని భావిస్తుందట. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో సుమ నోరు విప్పితేగానీ తెలీదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now