Anchor Shyamala : కోటి రూపాయ‌ల విల్లాలోకి అడుగుపెట్టిన యాంకర్ శ్యామ‌ల‌.. వైర‌ల్‌గా మారిన వీడియో..!

November 30, 2021 8:59 AM

Anchor Shyamala : బుల్లితెర ఫేమ‌స్ యాంక‌ర్స్ లో శ్యామల ఒక‌రు. సీరియల్స్, వంటల ప్రోగ్రాంలు, సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో బాగానే ఫేమస్ అయింది. అయితే బిగ్ బాస్ రెండో సీజన్‌తో శ్యామలకు క్రేజ్ వచ్చింది. గీతామాధురి, శ్యామల, యాంకర్ దీప్తి గ్యాంగ్‌.. ఆ సీజన్‌లో బాగానే హల్చల్ చేసింది. మ‌ధ్య‌లో ఎలిమినేట్ అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ కౌశల్ ఆర్మీ దెబ్బకు శ్యామల బలైపోయింది. అయితే ఇటీవ‌ల త‌న భ‌ర్త‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లపై శ్యామ‌ల కూడా వార్త‌లలోకి ఎక్కింది.

Anchor Shyamala : కోటి రూపాయ‌ల విల్లాలోకి అడుగుపెట్టిన యాంకర్ శ్యామ‌ల‌.. వైర‌ల్‌గా మారిన వీడియో..!

శ్యామల భర్తపై ఛీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. రాయదుర్గం పోలీసులు చీటింగ్‌ కేసులో ఆయనను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు నరసింహా. త‌ర్వాత బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు.

రీసెంట్‌గా యాంకర్‌ శ్యామల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేయగా కొద్ది గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నూతన ఇంట్లోకి మారిన శ్యామల దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకకు నటులు అలీ, సుమ, రాజీవ్‌ కనకాల, తనీష్‌లతోపాటు సింగర్‌ గీతా మాధురి సహా పలువురు హాజరయ్యారు. అయితే ఈ ఖరీదైన విల్లాని మొత్తం పాలరాతితో నిర్మించ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment