Anchor Shyamala : అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసిన యాంక‌ర్ శ్యామ‌ల‌.. వీడియో వైర‌ల్‌..!

May 24, 2022 10:07 PM

Anchor Shyamala : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్త సురేష్‌లు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ మూవీ రూ.200 కోట్ల క్ల‌బ్‌లోనూ ఎంట‌ర్ అయింది. ఇక మ‌హేష్ ఈ మూవీతో హ్యాట్రిక్ విజ‌యాన్ని సాధించాడు. దీంతో ఆయ‌న ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

స‌ర్కారు వారి పాటకు తొలి రెండు రోజులు కాస్త నెగెటివ్ టాక్ వ‌చ్చినా.. మంచి మెసేజ్ ఇచ్చే మూవీ కావ‌డంతో అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్రేక్ష‌కులు ఈ మూవీని ఆద‌రిస్తున్నారు. దీంతో విజయ ఢంకా మోగిస్తూ రికార్డుల వేట కొన‌సాగిస్తోంది. ఇక ఈ మూవీలోని అన్ని పాట‌లు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా చివ‌ర్లో విడుద‌ల చేసిన మ‌.. మ‌హేషా పాట ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. దీనికి ఇప్ప‌టికే చాలా మంది స్టెప్పులేశారు. ఇక తాజాగా ఈ జాబితాలో యాంక‌ర్ శ్యామ‌ల కూడా వ‌చ్చి చేరింది. ఈ పాట‌కు ఈమె వేసిన స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి.

Anchor Shyamala danced for Mahesha song video
Anchor Shyamala

యాంక‌ర్ శ్యామ‌ల ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. టీవీ షోల్లోనూ ఈమె క‌నిపించ‌డం త‌క్కువైపోయింది. కానీ సినిమాల్లో అవ‌కాశాలు మాత్రం వ‌స్తున్నాయి. ఇక ఈమె మ‌హేషా పాట‌కు అదిరిపోయే రీతిలో స్టెప్పులేసింది. ఈ క్ర‌మంలోనే ఈమె త‌న డ్యాన్స్ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. దీన్ని ఎంతో మంది నెటిజన్లు ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Are Syamala (@syamalaofficial)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment