ఆదివారం, జూలై 26, 2026
health fitness

Green Peas : పచ్చి బఠానీల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలిస్తే.. వదలకుండా తింటారు..!

Green Peas : పచ్చి బఠానీలను సహజంగానే చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో పులావ్‌లు, మసాలా కర్రీలు, చాట్‌లు, బిర్యానీ, సమోసా.. వంటి వంటకాలను తయారు చేసి తింటుంటారు. వీటిని అలాగే రోస్ట్‌ చేసి…

Green Peas : పచ్చి బఠానీల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలిస్తే.. వదలకుండా తింటారు..!

Green Peas : పచ్చి బఠానీలను సహజంగానే చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో పులావ్‌లు, మసాలా కర్రీలు, చాట్‌లు, బిర్యానీ, సమోసా.. వంటి వంటకాలను తయారు చేసి తింటుంటారు. వీటిని అలాగే రోస్ట్‌ చేసి ఉప్పు, కారం చల్లి తింటే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ప్రయోజనాలు అందుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Green Peas
Green Peas

1. పచ్చి బఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, విటమిన్లు ఎ, సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే అనేక పోషకాలను పొందవచ్చు. అవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి.

2. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్‌ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.

3. అధిక బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే ప్రయోజనం కలుగుతుంది. బరువు త్వరగా తగ్గవచ్చు. శరీరానికి శక్తి లభిస్తుంది.

4. షుగర్‌ లెవల్స్‌ అధికంగా ఉన్నవారు తరచూ పచ్చి బఠానీలను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది.

5. పచ్చి బఠానీల్లో పాలిఫినాల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి అల్సర్లను నయం చేస్తాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

6. పచ్చి బఠానీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్‌, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

7. పచ్చి బఠానీల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

8. పచ్చి బఠానీలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్‌ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి