
భారత సైన్యం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in లో విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 25వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్/స్టోర్‌కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, ఉమెన్ మిలిటరీ పోలీస్ వంటి విభాగాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 13, 2026 నుంచి ప్రారంభం కాగా ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగుతాయి. ఈ నియామక ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇది అగ్నిపథ్ పథకం కింద జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్లపాటు సైన్యంలో సేవలు అందించాల్సి ఉంటుంది.
ఖాళీలు, అర్హతలు..
ఈ నియామకాల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీస శారీరక అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థి ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 77 సెం.మీ. (విస్తరణ లేకుండా) ఉండాలి. ఛాతీ విస్తరణ కనీసం 5 సెం.మీ. ఉండాలి. అన్ని విభాగాల అభ్యర్థులకు రూ.250 ప్రాసెసింగ్ ఫీజు నిర్ణయించారు. ఈ ఫీజును SBI పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు.
ఎంపిక విధానం, పరీక్షా విధానం..
అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT/CEE) నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జనరల్ ఇంగ్లిష్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ సబ్జెక్టులు అభ్యర్థి దరఖాస్తు చేసిన పోస్టును బట్టి మారుతాయి.
జీడీ పోస్టులకు 50 ప్రశ్నలు – 100 మార్కులు, టెక్నికల్, క్లర్క్/స్టోర్‌కీపర్ పోస్టులకు 50 ప్రశ్నలు – 200 మార్కులు ఉంటాయి. CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశగా రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో 1.6 కిలోమీటర్ల పరుగు, పుల్-అప్స్, 9 అడుగుల డిచ్, జిగ్-జాగ్ బ్యాలెన్స్, శారీరక కొలతల పరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
అగ్నిపథ్ పథకం కింద వేతన విధానం..
ఎంపికైన అగ్నివీర్లకు ప్రత్యేకంగా రూపొందించిన వేతన విధానం అమలు చేస్తారు. మొదటి సంవత్సరంలో రూ.30,000 నెల జీతం లభిస్తుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది రూ.5,000 చొప్పున పెరిగి నాలుగో ఏడాదికి రూ.40,000కు చేరుతుంది. ఇందులో నుంచి 30 శాతం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ చేయాల్సి ఉంటుంది. దీంతో మొదటి ఏడాది ఇన్‌హ్యాండ్ జీతం రూ.21,000, నాలుగో ఏడాదికి రూ.28,000 వరకు లభిస్తుంది. ఈ కార్పస్ ఫండ్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా సమానంగా వాటా వేస్తుంది.
గమనిక: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2026కు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్, దరఖాస్తు లింక్‌లు భారత సైన్యం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లేదా వెబ్ సైట్‌ను సందర్శించి వివరాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అప్ డేట్స్ కోసం సదరు వెబ్‌సైట్‌ను తరచూ విజిట్ చేయాల్సి ఉంటుంది.








