థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ప్పుడు టైం లేద‌నో, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో సినిమాను చూడ‌లేక‌పోతే నెల త‌రువాత ఓటీటీలో క‌చ్చితంగా మిస్ అవ‌కుండా చూస్తున్నారు.

March 31, 2026 6:13 PM
Suhas and Shivani Nagaram in Hey Bhagwan movie now streaming on ZEE5.
జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హే భగవాన్’. Photo Credit: ZEE5.

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ప్పుడు టైం లేద‌నో, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో సినిమాను చూడ‌లేక‌పోతే నెల త‌రువాత ఓటీటీలో క‌చ్చితంగా మిస్ అవ‌కుండా చూస్తున్నారు. థియేట‌ర్ల‌లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న అనేక సినిమాలు ఓటీటీల్లో హిట్ అవ‌డాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇదే కోవ‌లో థియేట‌ర్ల‌లో చాలా మంది మిస్ అయిన హే భ‌గ‌వాన్ అనే మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, సుహాస్‌, శివాని నాగారం త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ప్ర‌స్తుతం జీ5 ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంది. తెలుగుతోపాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్ర‌వ‌రి 20, 2026న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర్వాలేద‌నిపించింది. దీంతో చాలా మంది ఈ మూవీని మిస్ అయ్యామ‌ని భావించారు. అలాంటి వారు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను వీక్షించ‌వ‌చ్చు.

కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాలంటే..

హే భ‌గ‌వాన్ చిత్రానికి ముందుగా హే బ‌ల్వంత్ అనే టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ అనంత‌రం సినిమా టైటిల్‌ను హే భ‌గ‌వాన్‌గా మార్చారు. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌తోపాటు సుద‌ర్శ‌న్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీకి గోపీ ఆచంట ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, త్రిశూల్ విజ‌న‌రీ స్టూడియెస్ బ్యాన‌ర్‌పై బి.న‌రేంద్ర రెడ్డి సినిమాను నిర్మించారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఐఎండీబీలో 10కి 5.8 రేటింగ్ వ‌చ్చింది. అందువ‌ల్ల సినిమా యావ‌రేజ్‌గా ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల రివ్యూలు, రేటింగ్‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయితే ఓటీటీలో చాలా మందికి ఎలాగూ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉంటుంది క‌నుక మంచి ఎంట‌ర్‌టెయిన్‌మెంట్ కోరుకునే వారు ఈ కామెడీ డ్రామా మూవీని ఒక‌సారి వీక్షించ‌వ‌చ్చు.

క‌థ ఏంటంటే..

సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. కృష్ణ (సుహాస్‌)కు త‌ల్లి ఉండ‌దు. తండ్రి రావు బ‌ల్వంత్ (న‌రేష్‌) సంర‌క్ష‌ణ‌లో పెరుగుతాడు. అయితే బ‌ల్వంత్‌ ఓ బిజినెస్ చేస్తుంటాడు కానీ ఆ బిజినెస్ ఏంట‌నేది కృష్ణ‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలియ‌దు. దీంతో పెద్ద‌య్యాక ఆ బిజినెస్ గురించి తెలుసుకోవ‌డంతోపాటు దాన్ని టేకోవ‌ర్ చేయాల‌ని కృష్ణ క‌ల‌లు కంటుంటాడు. అయితే ఒకానొక సంద‌ర్భంలో ఆ విష‌యం అత‌నికి తెలుస్తుంది. దీంతో కృష్ణ షాక‌వుతాడు. ఈ క్ర‌మంలో ఆ విష‌యం అత‌ను ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం)కు కూడా తెలుస్తుంది. అయితే త‌రువాత ఏం జ‌రిగింది..? అస‌లు బ‌ల్వంత్ చేస్తున్న బిజినెస్ ఏంటి..? దాని వ‌ల్ల కృష్ణ‌కు ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చాయి..? చివ‌ర‌కు త‌న ప్రియురాలితో ప్రేమ విష‌యం ఏం జ‌రిగింది..? అన్న వివ‌రాలు తెలుసుకోవాలంటే సినిమాను ఓటీటీలో చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment