
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో టచ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. పాతతరం నటులు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడాల్సి వస్తోంది. అయితే సోషల్ ఖాతాలు అసలు లేని నటులకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి పేరిట కొందరు నకిలీ ఖాతాలను తెరచి వాటిల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో నెటిజన్లకు అది నిజమైన ఖాతానా, నకిలీదా అన్న విషయం తెలియడం లేదు. నటి ఖుష్బూ భర్త సుందర్.సి కి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఖుష్బూ ఈ విషయంపై స్పందించి తన భర్త పేరిట ఏ సోషల్ మీడియా ఖాతాలోనూ అకౌంట్లు లేవని, ఆయన సోషల్ ప్లాట్‌ఫామ్‌లను వాడరని, ఆయన పేరిట ఉన్న ఖాతాలను నమ్మవద్దని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.
ఆ ఖాతాలను నమ్మకండి: ఖుష్బూ
చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను తమ అభిమానులకు, తమకు మధ్య వారధిగా భావించి వాటిని ఉపయోగిస్తున్నారు. ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా చాలా వేదికలు ఉన్నాయి. వాటిల్లో తరచూ పోస్టులు పెడుతూ తమ అభిమానులకు తమ అప్డేట్స్ ఇస్తున్నారు. ఏవైనా సినిమాలు రిలీజ్‌కు ఉంటే వాటిని ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అప్డేట్స్ను ఆయా వేదికల్లో షేర్ చేస్తున్నారు. అయితే సెలబ్రిటీల పేరిట కొందరు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. దీంతో సెలబ్రిటీలకు లేని పోని తలనొప్పులు వస్తున్నాయి. నటి ఖుష్బూ భర్త సుందర్.సి పేరిట ఎవరో ఓ వ్యక్తి ఎక్స్‌లో ఓ ఫేక్ ఖాతాను రన్ చేస్తుండగా, అది నకిలీ అని, తన భర్తకు అసలు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ అకౌంట్లే లేవని ఖుష్బూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి ఖాతాలను నమ్మవద్దని, అధికారిక ఖాతాలనే విశ్వసించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
This is a fake account of Director #SundarC . He is not not any social media platform as on date. Pls do not follow this or interact on this or any other similar account on any social platform. . Shall be creating a new and verified account for him soon. 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/9P1VYV67U7
— KhushbuSundar (@khushsundar) March 30, 2026
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సుందర్.సి..
తన భర్త సుందర్.సి పేరిట రన్ చేస్తున్న ఫేక్ అకౌంట్‌కు చెందిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఖుష్బూ తన పోస్టులో షేర్ చేశారు. అది ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేస్తూ తన భర్త ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేడని, సుందర్.సి పేరుతో కనిపించే ఖాతాలను నమ్మవద్దని ఆమె కోరారు. త్వరలోనే ఆయన ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసి వాడబోతున్నారని తెలిపారు. కాగా ఖుష్బూ ఒకప్పుడు టాప్ హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మొదట్లో డీఎంకే పార్టీలో చేరారు. అందులో 4 ఏళ్లు సేవ చేసిన అనంతరం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. 6 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆమె మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. కాగా త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె భర్త సుందర్.సి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి పార్టీ ద్వారా ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు. మధురై నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.












