ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి స‌పోర్ట్‌గా మాట్లాడిన శ్రీ‌రెడ్డి.. అత‌నికి వార్నింగ్‌..

October 28, 2022 9:30 PM

శ్రీరెడ్డి అంటే ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె మాట్లాడే మాట‌లు ఎంత దారుణంగా ఉంటాయో.. ఎంత దుమారం రేపుతాయో మ‌నంద‌రికీ తెలిసిందే. ఆమెను ఎంతమంది విమ‌ర్శించినా, ట్రోల్స్ చేసినా ఆమె మాత్రం త‌న విధానాన్ని అస్స‌లు మార్చుకోలేదు. వైసీపీ అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఫేస్ బుక్ లైవ్ లోకి వస్తుంది. విమర్శలు చేసిన వారినిపై బూతూ పదజాలంతో కడిగేస్తుంది. ఇటీవల జనసేన అధినేత పవన్ పై కూడా అదే చేసింది. అయితే సాధారణంగా పవన్ పై విమర్శలు చేసే శ్రీరెడ్డి ఫస్ట్ టైం ఆయనకు మద్దతుగా నిలిచింది.

పవన్ పై వ్యతిరేకంగా మట్లాడిన అనిల్ రెడ్డిని బూతులతో కడిగిపారేసింది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. పవన్ భార్య, పిల్లల్ని తీవ్రస్థాయిలో ధూషిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పవన్ భార్య పిల్లలను తనకు అప్పగించాలని అనిల్ కుమార్ నోరు పారేసుకున్నాడు. ఈ వీడియోపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ వైసీపీపై ఉన్న అభిమానంతో మనమంతా జగనన్నను నమ్మిన వాళ్ళం.

అయితే వైసీపీ పార్టీలో ఉన్న ఓ వెధవ జనసేన అధినేత పవన్ వ్యక్తిగతం గురించి తప్పుగా మాట్లాడాడు. పవన్ ను తిట్టు తప్పులేదు.. కానీ ఆయన భార్య, పిల్లలను అనిల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు. ఆడవాళ్ళ జోలికొస్తే తాట తీస్తా అంటూ ఫైర్ అయింది. జగనన్న పార్టీలో ఉన్న ఈ అనిల్ కుమార్ అనేవాడు వైసీపీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. జగన్ నా చుట్టం అంటూ.. దోచుకుంటున్నాడు. ఇలాంటి రౌడీ వెధవలను జగనన్న ఎంకరేజ్ చేయడు. వీడి గురించి జగనన్నకు చేరవేయండి.. అంటూ శ్రీరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now