వినోదం

దుబాయ్‌లో చిక్కుకుపోయారా? నేనున్నాను.. సోనూసూద్ మరో భారీ సాయం!

గల్ఫ్ దేశాల్లోని అనిశ్చితి నేపథ్యంలో ఆపన్నహస్తం అందించిన సోనూసూద్. Photo Credit: Sonu Sood/X.

న‌టుడు సోనూసూద్ మ‌రోమారు దాతృత్వం చాటుకున్నారు. కోవిడ్‌-19 సంక్షోభం స‌మ‌యంలో, పంజాబ్ లో వ‌ర‌ద‌ల‌ప్పుడు ఆయ‌న ఎంతో మందికి స‌హాయం చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అమెరికా-ఇరాన్ యుద్ధ స‌మ‌యంలోనూ గ‌ల్ఫ్ దేశాల్లో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా అక్క‌డ చిక్కుకుపోయిన వారికి స‌హాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో సోనుసూద్ మాట్లాడుతూ యుద్ధం కార‌ణంగా దుబాయ్‌లో ఎంతో మంది యాత్రికులు చిక్కుకుపోయార‌ని తెలిపారు. మీకు లేదా మీకు తెలిసిన ఎవ‌రైనా దుబాయ్‌లో చిక్కుకుని, ఎక్క‌డికి వెళ్లాలో తెలియ‌క‌పోతే అలాంటి వారికి సుర‌క్షిత‌మైన బ‌సను ఎలాంటి ఖ‌ర్చు లేకుండానే ఉచితంగా అందిస్తున్నాం. మాకు దేశంతో ప‌నిలేదు. ఎవ‌రైనా స‌రే, ఎలాంటి నియ‌మాలు లేవు. కేవ‌లం మాన‌వ‌త్వం మాత్ర‌మే. స‌హాయం కావ‌ల్సిన వారు సోష‌ల్ మీడియాలో నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి.. అని సోను తెలిపారు. అయితే సోను చూపిన దాతృత్వానికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఆయ‌న‌ను మ‌ళ్లీ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు.

ఏ దేశం వారికైనా స‌హాయం: సోనూసూద్‌

యుద్ధం కార‌ణంగా దుబాయ్‌లో చిక్కుకున్న చాలా మందికి స‌హాయం కావాల‌ని సోనుసూద్ అన్నారు. ఎవ‌రికైనా స‌హాయం కావ‌ల్సి వ‌స్తే తాము ఉచితంగా బ‌స‌ను ఏర్పాటు చేశామ‌ని, ఏ దేశానికి చెందిన వారైనా స‌రే త‌మ‌కు ప‌ట్టింపు లేద‌ని, స‌హాయం అందిస్తామ‌ని, త‌మ దేశానికి వెళ్లేంత వ‌ర‌కు నిశ్చింత‌గా, సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చ‌ని, త‌మ‌కు మాన‌వ‌త్వం ముఖ్య‌మ‌ని, ఏ దేశానికి చెందిన వారు అన్న‌ది ముఖ్యం కాద‌ని సోను త‌న వీడియోలో స్ప‌ష్టం చేశారు. అయితే సోనుసూద్ స‌హాయంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అప్ప‌ట్లో కోవిడ్ 19 స‌మ‌యంలో సోను చేసిన స‌హాయం మ‌రిచిపోలేనిద‌ని, ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ ఇలా ద‌య చూపిస్తున్నార‌ని, ఆయ‌న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నామ‌ని పాకిస్థాన్‌కు చెందిన కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.

స‌హాయం కోసం అభ్య‌ర్థ‌న‌..

డియ‌ర్ సోను, నా కుమారుడు, కోడ‌లు కొత్త‌గా పెళ్లి చేసుకుని దుబాయ్‌కి హ‌నీమూన్ నిమిత్తం వెళ్లారు. వారు ఇప్పుడు అక్క‌డ చిక్కుకున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ద‌య‌చేసి మీరు వారికి స‌హాయం చేయండి. నా కోడ‌లికి ఇండియాలో ఎగ్జామ్స్ ఉన్నాయి. వారిని ఎలాగైనా ఇండియాకు వ‌చ్చేలా చేయండి.. అని ఒక యూజ‌ర్ కోరారు. అయితే ఒక యూజ‌ర్ మాత్రం.. యూఏఈ ప్ర‌భుత్వం త‌మ‌కు హోట‌ల్‌లో గ‌దుల‌ను, ఆహారాన్ని ఉచితంగానే అందిస్తుంద‌ని, అందువ‌ల్ల త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య లేద‌ని, ఏదైనా స‌హాయం కావ‌ల్సి వ‌స్తే క‌చ్చితంగా సోనుని సంప్ర‌దిస్తామ‌ని తెలిపారు.

కొంద‌రు ఇంకా అక్క‌డే..

కాగా గ‌త ఫిబ్ర‌వ‌రి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసి ఆ దేశ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీని అంత‌మొందించిన విష‌యం తెలిసిందే. దీంతో గ‌ల్ఫ్ దేశాల్లో తీవ్ర యుద్ధ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అందులో భాగంగానే చాలా మంది ఆ దేశాల్లో చిక్కుకుపోయారు. బాలీవుడ్ న‌టులు సోన‌ల్ చౌహాన్‌, ఇషా గుప్తా వంటి వారు అక్క‌డే ఉండ‌గా తాజాగా మ‌ళ్లీ ప‌రిమిత సంఖ్య‌లో విమానాల‌ను ప్రారంభించ‌డంతో వారు సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నారు. అయితే ఇప్ప‌టికీ ఇంకా అక్క‌డ అనేక మంది చిక్కుకుని స‌హాయం కోసం వేచి చూస్తుండ‌గా సోను వారి కోసం అలా స్పందించ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM