వినోదం

‘ప్లాన్ చేస్తే ఏదీ జరగదు’.. కెరీర్ కష్టాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్!

తన కెరీర్ లోని ఎత్తుపల్లాలపై స్పందించిన నటి రాశీ ఖన్నా. Photo Credit: Raashii Khanna/Instagram.

త‌న‌కు క‌మ్‌ఫ‌ర్ట్ జోన్‌లో ఉండ‌డం అల‌వాటు లేద‌ని, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటే వెళ్తాన‌ని, ప్లాన్ చేసిన‌వి జ‌ర‌గ‌డం లేద‌ని, వ‌దులుకున్న త‌రువాతే అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని న‌టి రాశీ ఖ‌న్నా తెలిపింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ త‌న కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకుంది. హిందీలో ఇంకా తాను కొత్త‌దాన్నేన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సినిమాలే చేశాన‌ని చెప్పుకొచ్చింది. ద‌క్షిణాది అభిమానులు ఇచ్చిన ప్రేమ‌, ఆద‌ర‌ణ ఎంతో ఉన్న‌త‌మైంద‌ని గుర్తు చేసుకుంది. ఉత్త‌రాదిలో ఇప్పుడిప్పుడే త‌న‌ను గుర్తిస్తున్నార‌ని, ఇది త‌న‌కు మ‌రో కొత్త అధ్యాయ‌మ‌ని తెలిపింది. తెలుగులో కెరీర్ ఆరంభంలో వ‌చ్చిన ప్ర‌తి ఆఫ‌ర్‌ను స్వీక‌రించాన‌ని, అప్పుడు నేర్చుకోవ‌డంపైనే దృష్టి పెట్టాన‌ని, పాత్ర చిన్న‌దా, పెద్ద‌దా అనే విష‌యాన్ని ప‌ట్టించుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఫ‌ర్హాన్ తో 10 ఏళ్ల కింద‌ట యాడ్‌లో..

ఒకప్పుడు తాను పాత్ర‌ల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకునేదాన్ని కాద‌ని, కానీ ఇప్పుడు మాత్రం భావోద్వేగాల‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో చేయాల‌నుకుంటున్నాన‌ని త‌న మ‌న‌సులో మాట‌ను రాశీ ఖ‌న్నా తెలియ‌జేసింది. హిందీలో మ‌హిళా ప్ర‌ధాన క‌థ‌లు రావ‌డం ఆనందంగా ఉంద‌ని, 120 బ‌హ‌దూర్ మూవీలో ఫ‌ర్హాన్ అక్త‌ర్‌తో క‌లిసి న‌టించ‌డం ప్ర‌త్యేక అనుభూతిని ఇచ్చింద‌ని తెలిపింది. 10 ఏళ్ల కింద‌ట ఫ‌ర్హాన్‌తో ఒక యాడ్‌లో క‌లిసి చేశాన‌ని, అప్ప‌ట్లో పెద్ద‌గా ఆయ‌న‌తో మాట్లాడ‌లేద‌ని, కానీ మ‌ళ్లీ ఈ సినిమా సెట్‌లో ఆయ‌న‌ను క‌ల‌వ‌డం నిజంగా జీవితంలో ఒక సర్కిల్ ను పూర్తి చేసిన‌ట్లు అయింద‌ని చెప్పింది. ఫర్హాన్ చాలా స‌ర‌దాగా ఉంటార‌ని చెప్పుకొచ్చింది.

తెలుగు నేర్చుకోవాల‌ని ఉండేది..

తెలుగులో న‌టించాల్సి వ‌చ్చిన‌ప్పుడు తాను మొద‌ట భ‌య‌ప‌డ్డాన‌ని రాశీ ఖ‌న్నా తెలిపింది. భ‌య‌మే పెద్ద అడ్డంకి అని, త‌ప్పులు మాట్లాడినా తెలుగులోనే మాట్లాడేదాన్న‌ని వెల్ల‌డించింది. త‌న‌కు అప్ప‌ట్లో తెలుగు నేర్చుకోవాల‌నే త‌ప‌న బాగా ఉండేద‌ని, త‌మిళం, మ‌ళ‌యాళం కూడా అలాగే అల‌వాటు చేసుకున్న‌ట్లు తెలిపింది. ఇప్పుడు ఏ భాష‌నైనా స‌రే నేర్చుకుని పనిచేయ‌గ‌ల‌న‌నే నమ్మ‌కం వ‌చ్చింద‌ని తెలియ‌జేసింది. ర‌వితేజ సానుకూల దృక్ప‌థం త‌న‌పై ప్ర‌భావం చూపింద‌ని, జూనియ‌ర్ ఎన్‌టీఆర్ నుంచి ప్ర‌తిభే నిల‌బెడుతుంద‌న్న పాఠం నేర్చుకున్నాన‌ని పేర్కొంది. ధ‌నుష్‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల త‌న న‌ట‌న మెరుగుప‌డింద‌ని, మోహ‌న్‌లాల్ హావ‌భావాల‌ను చ‌క్క‌గా పలికిస్తార‌ని, ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌న ఉంటే ఆయ‌న ఆరాకు డైలాగ్‌లు కూడా మ‌ర్చిపోతాన‌ని తెలిపింది.

రాశీ ఖ‌న్నా ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా ఆమె నటించిన త‌లాకోన్ మే ఏక్ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇందులో ఆమె విక్రాంత్ మెస్సీతో క‌లిసి యాక్ట్ చేసింది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, పేరు, డ‌బ్బు త‌న ల‌క్ష్యం కావ‌ని రాశీ ఖ‌న్నా ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది. కాగా ఆమె మ‌ద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌రువాత త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM