టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ భారీ సక్సెస్ అయిందని, టోర్నీ ఇంకా ముగియక ముందే గత టీ20 వరల్డ్ కప్‌ల వ్యూయర్‌షిప్ రికార్డులను బ్రేక్ చేసిందని ఐసీసీ చైర్మన్ జైషా అన్నారు. ప్రస్తుత టోర్నీ ఇప్పటి వరకు 50 కోట్ల వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసిందని, ఇది టీ20 వరల్డ్ కప్ టోర్నీల చరిత్రలోనే అత్యంత అధిక వ్యూయర్‌షిప్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి సులభంగా చేరడంతోనే ఈ టోర్నీ ఇంత పెద్ద సక్సెస్ అయిందని, పెద్ద ఎత్తున ప్రజలు క్రికెట్‌ను ఆదరిస్తున్నారని చెప్పేందుకు ఇది ఉదాహరణ అని అన్నారు. డిజిటల్ యుగం కారణంగా చాలా మంది వీక్షకులు పెరిగారని, ఈ టోర్నీ ఇంత సక్సెస్ అయ్యేందుకు ఇది కూడా ఒక కారణమని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నిర్వహణపై పోస్టు పెట్టారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మందికి చేరాలనే లక్ష్యంతో మొదలైంది. కానీ మేము ఊహించినదానికన్నా భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఏకంగా 50 కోట్ల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగిన ఈ టోర్నీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యధిక స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సాధించింది.. అని జైషా అన్నారు. భారత్‌లో జియో హాట్ స్టార్ మాధ్యమంలో ఒకానొక దశలో లైవ్‌లో 6.05 కోట్ల మంది మ్యాచ్‌ను చూశారని తెలిపారు. అయితే సెమి ఫైనల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో భారత అభిమానులు ఇంకా అధిక స్థాయిలో మ్యాచ్‌లను వీక్షిస్తారు కనుక ఇప్పుడు ఏర్పడిన రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని పేర్కొన్నారు. గత సీజన్ అమెరికా, వెస్టిండీస్‌లలో టీ20 ప్రపంచ కప్ జరగ్గా వచ్చిన వ్యూయర్‌షిప్‌ను ప్రస్తుత టోర్నీ ఇప్పటికే దాటేసిందని, ఇంకా మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో అధిక స్థాయిలో వ్యూయర్ షిప్ నమోదు అవడం ఖాయమని అన్నారు.
కాగా 2025లో పాకిస్థాన్, యూఏఈ వేదికలుగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సైతం అధిక వ్యూయర్‌షిప్‌ను సాధించింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ ఆ టోర్నీ 250 బిలియన్ల నిమిషాల వాచ్-టైమ్‌ను నెలకొల్పగా, టీవీలో 122 మిలియన్ల వాచ్-టైమ్‌ను క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ను భారత్, శ్రీలంక వేదికలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభం కాగా మార్చి8న ముగియనుంది.
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…