వినోదం

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ మార్పు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి వారం ముందే సిద్ధమైన భగత్ సింగ్. Photo Credit: Mythri Movie Makers/X.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు బంప‌ర్ న్యూస్‌. ఆయ‌న న‌టిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా రిలీజ్ డేట్‌ను వారం రోజులు ముందుకు మార్చారు. ఈ మేర‌కు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ముందుగా అనుకున్న తేదీ క‌న్నా ఒక వారం ముందుగానే థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 26, 2026కు బ‌దులుగా మార్చి 19, 2026న సినిమాను రిలీజ్ చేస్తున్నామ‌ని, బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఫ్యాన్స్ భారీ ఎత్తున సంబ‌రాలు జ‌రుపుకునేందుకు సిద్ధంగా ఉండాల‌ని తెలిపారు. అలాగే తాజాగా థ‌మ‌న్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా తీసుకోవ‌డంపైనా క్లారిటీ ఇచ్చారు.

థ‌మ‌న్‌ను అందుక‌నే తీసుకున్నాం: మైత్రి మూవీ మేక‌ర్స్‌

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన దేఖ్‌లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్‌ల‌కు భారీ ఎత్తున స్పందన ల‌భిస్తోందని మైత్రి మూవీ మేక‌ర్స్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ సినిమా మ్యూజిక్‌ను ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నామ‌ని వెల్ల‌డించింది. అయితే రిలీజ్ తేదీని ముందుకు జ‌ర‌ప‌డం వ‌ల్ల మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ‌ప్ర‌సాద్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించ‌డం కష్టంగా మారింద‌ని, ఆయ‌న‌కు షెడ్యూల్ వీలు కావ‌డం లేద‌ని, క‌నుక థ‌మ‌న్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తార‌ని మేక‌ర్స్‌ స్ప‌ష్టం చేశారు. రిలీజ్ డేట్‌ను దృష్టిలో ఉంచుకుని అంద‌రితో చ‌ర్చించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ప్రేక్ష‌కులు త‌మ ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని, ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల కార‌ణంగా సినిమాకు మ‌రింత బూస్ట్ ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. సినిమా మ్యూజిక్‌, సాంగ్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు.

ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన పాట‌ల‌ను ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు చెబుతూ త్వ‌ర‌లోనే మ‌రో పాట‌ను కూడా రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌కటించారు. ఆ పాట‌కు కూడా భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు వివ‌రించారు. రాక్‌స్టార్ డీఎస్‌పీ, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ మ‌రోమారు సూప‌ర్ హిట్ పాట‌ల‌ను ఫ్యాన్స్‌కు అందిస్తుంద‌ని అన్నారు. కాగా ఇటీవ‌లే య‌ష్ న‌టిస్తున్న టాక్సిక్ సినిమాను వార్ క్రైసిస్ కార‌ణంగా జూన్‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గా ఈ నేప‌థ్యంలోనే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చెప్పిన తేదీ క‌న్నా ఇంకా ముందుకు జ‌ర‌గ‌డం విశేషం. అయితే ఈ నిర్ణ‌యం పట్ల సినీ ప్రేక్ష‌కులు, ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ అభిమాన హీరో సినిమా అనుకున్న తేదీ క‌న్నా వారం ముందుగానే వ‌స్తుండ‌డం ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో శ్రీ‌లీల‌, రాశి ఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM