సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ మూవీలు అంటే ఇష్టపడే వారికోసం సన్ నెక్ట్స్‌లో మరో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny) పేరిట తమిళంలో జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజ్ అయిన మూవీని మార్చి 6, 2026 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు నేరుగా ఈ మూవీని చూడవచ్చు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీకి సంబంధించి కథనం చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠగా సాగుతుందని సినిమాను చూసిన ప్రేక్షకులు ఇప్పటికే చెప్పారు. ఈ మూవీకి ఇప్పటికే ఐఎండీబీలో 10కి 7.2 రేటింగ్ ఉండడం విశేషం.
గ్రానీ సినిమా కథ విషయానికి వస్తే లండన్‌కు చెందిన దంపతులు సిటీ లైఫ్‌కు దూరంగా గడుపుదామని తమిళనాడులోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న తమ పూర్వీకుల ఇంటికి వస్తారు. అక్కడ వారు అనుకోకుండా ఓ వృద్ధురాలికి ఆశ్రయం ఇస్తారు. తరువాత ఆ ఇంట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే ఆ తరువాత ఏమైంది, అసలు ఆ వృద్ధురాలు ఎవరు..? అన్న వివరాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆసక్తిగొలిపే విధంగా ఉంది. ఆ దంపతులు తమ పూర్వీకుల ఇంట్లో ఏవో రహస్యాలు తెలుసుకున్నారంటూ ట్రైలర్‌లో చూపించారు. అంతేకాకుండా వారు భయపడుతున్నట్లుగా కూడా ఉంది. కనుక హార్రర్, థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుందని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు ఇప్పటికే కామెంట్లు పెట్టారు.
ఈ మూవీలో దిలీపన్, గజరాజ్, మాస్టర్ ఘనశ్యాం, వడివుక్కరసి, సింగంపులి తదితరులు నటించారు. ఈ సినిమాకు విజయకుమార దర్శకత్వం వహించగా సినిమా నిడివి 2 గంటల 4 నిమిషాలుగా ఉంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూఏ16ప్లస్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాకు కు.కార్తీక్, విజయకుమార రచయితలుగా పనిచేశారు.
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…