
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు ఇప్పటికే ఈ మూవీని మెచ్చుకున్నారు. ఈ జాబితాలో తాజాగా నటి అమీషా పటేల్ కూడా చేరిపోయారు. ఆమె ఈ మూవీకి కితాబిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ధురంధర్ 2 చిత్రాన్ని ఆమె ఐ ఓపెనర్‌గా పేర్కొన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ట్రెండ్లను అనుసరించకుండా సినిమా కథపై దృష్టి పెట్టినందుకు ఆయనను ఆమె అభినందించారు. ధురంధర్ 2 చిత్రం ఇండస్ట్రీ కళ్లు తెరిపించిందని, ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో ఈ సినిమా నిరూపించిందని అన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాను ప్రశంసిస్తుందని, ఎల్లప్పుడూ మూస ధోరణిలో కాకుండా కొత్త తరహాలో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ధురంధర్ 2 మరోమారు రుజువు చేసిందని అన్నారు.
భారీ ఎత్తున ప్రశంసలు..
ఇక అమీషా పటేల్ మాత్రమే కాకుండా ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. రామ్ గోపాల్ వర్మ, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి వారు ధురంధర్ ఫ్రాంచైజీతోపాటు ఆ చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఈ సినిమాకు సమానంగా ఆదరణ లభిస్తోంది. రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, నాగార్జున అక్కినేని వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించిన తరువాత ప్రశంసల వర్షం కురిపించారు.
Eye opener 👌Industry Praising DHURANDHAR is wow and the brand deserves all the accolades 👏👏industry needs to realise that ADITYA made a film and not a project,,casted actors and not instagrammars who trend at parties 👍stop making projects and and start making films👍
— ameesha patel (@ameesha_patel) March 24, 2026
ఇప్పటి వరకు మొత్తం రూ.844 కోట్ల వసూళ్లు..
కాగా విడుదలైన కొద్ది రోజులకే ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి సోమవారం (మార్చి23, 2026) రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా 20,382 షోల ద్వారా రూ. 65 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో దేశీయంగా ఈ చిత్రం సులభంగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర వసూళ్లు రూ. 844.76 కోట్లకు చేరుకున్నట్లు సాక్నిల్క్ నివేదిక తెలిపింది. ఈ చిత్రం ప్రస్తుతం కూడా అద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తుండగా, రాబోయే రోజుల్లోనూ బాక్సాఫీస్ వద్ద బలమైన రన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీక్వెల్‌గా వచ్చిన చిత్రం..
ధురంధర్ కి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, రణవీర్ సింగ్ పోషించిన హమ్జా అలీ మజారి అనే పాత్ర ఎదుగుదల చుట్టూ తిరుగుతుంది. అతను షేర్-ఎ-బలోచ్‌గా, ల్యారీ ప్రాంతానికి నిర్ద్వంద్వ రాజుగా ఎదిగిన విధానాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. అలాగే జస్కిరత్ సింగ్ రంగీ నుంచి హమ్జాగా మారిన అతని ప్రయాణాన్ని కూడా ఈ కథ ఆవిష్కరిస్తుంది. దేశంలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు గూఢచారిగా పాకిస్తాన్లోకి ప్రవేశించే వ్యక్తిగా అతని పాత్రను ఈ చిత్రం ప్రదర్శిస్తుంది.












