అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు ఆమె టీమ్ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. న‌టి అనుష్క శెట్టి త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుంద‌ని పేర్కొంటూ తాజాగా కొన్ని మీడియా సంస్థ‌లు గాసిప్ వార్త‌ల‌ను ప్ర‌చురించాయి.

March 19, 2026 3:38 PM
Anushka Shetty official statement regarding her wedding rumors.
తన పెళ్లిపై వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని స్పష్టం చేసిన నటి అనుష్క శెట్టి బృందం. Photo Credit: Anushka Shetty/Instagram.

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు ఆమె టీమ్ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. న‌టి అనుష్క శెట్టి త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుంద‌ని పేర్కొంటూ తాజాగా కొన్ని మీడియా సంస్థ‌లు గాసిప్ వార్త‌ల‌ను ప్ర‌చురించాయి. దీంతో సామాజిక మాధ్య‌మాల్లోనూ ఈ వార్త వైర‌ల్ అయింది. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని, ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆమె టీమ్ కోరింది. సోష‌ల్ మీడియా లేదా మీడియా సంస్థ‌ల్లో వ‌స్తున్న వార్త‌లు నిజం కావ‌ని, ధ్రువీక‌రించ‌ని స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తున్న వారి చ‌ర్య‌లు స‌రికావ‌ని పేర్కొంది. అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతుంద‌నే వార్త‌లు కేవ‌లం వ‌దంతులే అని స్ప‌ష్టం చేస్తూ మీడియా సంస్థ‌లు, సోష‌ల్ మీడియా పేజీల‌ను ఆమె టీమ్ తీవ్రంగా విమ‌ర్శించింది. ఇది వ్య‌క్తిగ‌త గోప్య‌త‌పై దాడి అని, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఆధార‌ర‌హిత వార్త‌లుగా మార్చ‌డం జ‌ర్న‌లిజం కాద‌ని స్ప‌ష్టం చేసింది.

మ‌హిళా న‌టుల‌పైనే ఇలాంటి ప్ర‌చారం ఎందుకు?

న‌టి అనుష్క శెట్టి వ‌య‌స్సుపై కూడా నిరంత‌రం అవ‌మాన‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ఇది స‌రికాద‌ని ఆమె టీమ్ పేర్కొంది. న‌టి వ‌య‌స్సుపై నిరంత‌రం దృష్టి పెట్ట‌డం గురించి టీమ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇది సూటిగా క‌నిపించ‌క‌పోయినా నిరంత‌రం కొన‌సాగుతున్న వ‌య‌స్సు వివ‌క్ష (ఏజ్ షేమింగ్) అని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి క‌థ‌నాలు మ‌హిళా న‌టుల గురించే ఎందుకు వ‌స్తాయో అర్థం కావ‌డం లేద‌ని, పురుష న‌టుల గురించి ఎవ‌రూ ఎందుకు మాట్లాడ‌ర‌ని ప్ర‌శ్నించింది. అనుస్క శెట్టి గౌర‌వ‌ప్ర‌ద‌మైన సినీ ప్ర‌యాణాన్ని సాగిస్తుంద‌ని, ఆమె ఎప్పుడూ ప్ర‌చారం కోసం పాకులాడ‌లేద‌ని, త‌న వ్యక్తిగ‌త జీవితాన్ని గోప్యంగా ఉంచ‌డానికే ఆమె ప్రాధాన్య‌త‌ను ఇస్తుంద‌ని తెలిపింది.

త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేయ‌డం జ‌ర్న‌లిజం కాదు..

వివాహం అనేది అత్యంత వ్య‌క్తిగ‌త విష‌య‌మని, దానిని కేవ‌లం క్లిక్స్ లేదా ఆక‌ర్ష‌ణ కోసం సంచ‌న‌లంగా చూపించ‌డం త‌గ‌ద‌ని ఆమె టీమ్ స్ప‌ష్టం చేసింది. అనుష్క శెట్టి వివాహంపై నిరంత‌రం పోస్టులు చేస్తున్న మీడియా సంస్థ‌లు, పేజీలు క‌నీసం అధికారిక ధ్రువీక‌ర‌ణ వ‌చ్చే వ‌ర‌కు అయినా వేచి చూడాల‌ని కోరింది. ఒక‌రి వ్య‌క్తిగ‌త జీవితాన్ని రోజువారీ వార్త‌లుగా మార్చే ముందు నిజాల‌ను తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. ఊహాగానాల‌తో, నిర్దార‌ణ లేని స‌మాచారాన్ని ప‌దే ప‌దే ప్ర‌చారం చేయ‌డం జ‌ర్న‌లిజం కాద‌ని, అది వ్య‌క్తిగ‌త జీవితంలో జోక్యం చేసుకోవ‌డ‌మేన‌ని పేర్కొంది. కాగా ఈ వివ‌ర‌ణ‌తో ప్ర‌స్తుతం అనుష్క శెట్టి వివాహంపై వ‌స్తున్న వార్త‌లు అన్నీ ఫేక్ అని తేలిపోయింది. ఇక మీడియా సంస్థ‌లు కూడా ఇలాంటి వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కుండా అనుష్క శెట్టి టీమ్ కూడా గ‌ట్టిగా బుద్ధి చెప్పిన‌ట్లు అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment