సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల ఎంతో స‌హ‌నం ప్ర‌వ‌ర్తించార‌ని, త‌న ప్రోత్సాహంతో నటిగా త‌న‌ను తాను నిరూపించుకున్నాన‌ని, ఆయ‌న త‌న‌కు ఎంతో స‌పోర్ట్‌గా నిలిచార‌ని న‌టి స్నేహ ఉల్లాల్ తెలిపింది.

March 20, 2026 9:29 PM
Sneha Ullal and Salman Khan in the movie Lucky: No Time for Love.
2005లో విడుదలైన ‘లక్కీ: నో టైమ్ ఫర్ లవ్’ చిత్ర షూటింగ్ విశేషాలను వివరిస్తున్న స్నేహ ఉల్లాల్. Photo Credit: Social Media/X.

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల ఎంతో స‌హ‌నం ప్ర‌వ‌ర్తించార‌ని, త‌న ప్రోత్సాహంతో నటిగా త‌న‌ను తాను నిరూపించుకున్నాన‌ని, ఆయ‌న త‌న‌కు ఎంతో స‌పోర్ట్‌గా నిలిచార‌ని న‌టి స్నేహ ఉల్లాల్ తెలిపింది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా రంగ ప్ర‌వేశంపై, తొలి చిత్ర షూటింగ్‌పై, ఇండ‌స్ట్రీలో త‌న అనుభ‌వాల‌పై ఆమె ప‌లు విష‌యాల‌ను షేర్ చేసుకుంది. 2005లో ల‌క్కీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ప్ర‌వేశించిన స్నేహ ఉల్లాల్ ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ నటించి న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ముఖం అచ్చం బాలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్యారాయ్‌లా ఉంటుంద‌ని ఆమెకు స‌ల్మాన్ త‌న ల‌క్కీ సినిమాలో చాన్స్ ఇచ్చారు. అప్ప‌ట్లో స్నేహ ఉల్లాల్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచింది. ల‌క్కీ: నో టైమ్ ఫ‌ర్ ల‌వ్ చిత్రానికి రాధికారావు, విన‌య్ సప్రూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

స‌ల్మాన్ ఎంతో స‌హ‌నంతో ఉంటారు..

అప్ప‌ట్లో స్నేహ‌ ఉల్లాల్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో తనకు ఉన్న పోలికల కారణంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ పోలిక ఆమెను ఇతర కొత్త నటీమణుల నుంచి భిన్నంగా నిలిపింది. లక్కీ చిత్రంలో ఆమెకు అవకాశం రావడానికి సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ కీలక పాత్ర పోషించారు. ఆమె స్నేహ‌ను గుర్తించి ఆ పాత్రకు సిఫార్సు చేసినట్లు స‌మాచారం. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సల్మాన్ ఖాన్ సెట్లో ఎలా ప్రవర్తించేవారో వివరించింది. లక్కీ చిత్ర షూటింగ్ సమయంలో సల్మాన్ ఎంతో సహనంతో, ప్రోత్సాహంతో తనకు తోడుగా ఉన్నారని, కొత్తగా వచ్చిన నటిగా తనకు అలవాటు పడటానికి సహాయపడ్డారని తెలిపింది. లక్కీ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ నాకు ఎంతో సహాయం చేశారు.. అని ఆల్ఫానియాన్ స్టూడియోజ్‌కు తెలిపింది.

ఐశ్వ‌ర్యారాయ్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పా..

సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్ తన సహనాన్ని కోల్పోయిన సందర్భం ఏదైనా ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఒక్కసారి కూడా కాదు. ఆయన చాలా సహనంతో, ఎంతో సహాయంగా ఉండేవారు. ప్రజల‌కు తెలిసిన సల్మాన్ ఖాన్ యాటిట్యూడ్ ను ఆయన నాతో ఎప్పుడూ ప్రదర్శించలేదు.. అని చెప్పింది. తన అరంగేట్రం గురించి మాట్లాడుతూ, నాకు అసలు నటిగా రావాలనే ఉద్దేశం లేదు. నేను కాలేజీలో చదువుతున్నాను. ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు, నా చిన్న ప్రపంచంలో నేనూ మిస్ వరల్డ్‌లా అనిపించింది. ఎందుకంటే చాలా మంది నేను ఆమెలా కనిపిస్తానని చెప్పేవారు.. అని వెల్లడించింది. ఐశ్వర్య రాయ్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, నేను ఐశ్వర్యను ఒక్కసారి కలిశాను. ఆమె వెల్‌కమ్ టు ది ఫ్యామిలీ, వెల్‌కమ్ టు బాలీవుడ్ అని అన్నారు. నేను ఆమెకు క్షమించండి, నన్ను ద్వేషించకండి అని చెప్పాను. ఆ సమయంలో మీడియాలో చాలా పోలికలు రావడంతో, ఆమె ఎలా స్పందించిందో నాకు తెలియదు.. అని స్నేహ‌ చెప్పింది.

లక్కీ తర్వాత స్నేహ‌ ఉల్లాల్ 2006లో సోహైల్ ఖాన్‌తో కలిసి ఆర్యన్ చిత్రంలో నటించింది. అనంతరం 2008లో ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె చివరిసారిగా తెలుగు చిత్రం నీలకంఠలో కనిపించింది. కాగా సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న యుద్ధ నేపథ్య చిత్రం మాతృభూమిని విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment