స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ఆయా విష‌యాల్లో ఫ్యాన్స్ ఆయ‌న‌ను ప్ర‌శంసిస్తుంటారు కూడా. ఆయ‌న షూటింగ్‌ల‌కు కూడా టైముకు చేరుకుంటారు.

March 21, 2026 6:09 PM
Akshay Kumar sharing his fitness and eating habits on a game show.
ఆరోగ్యకరమైన అలవాట్లే తన ఫిట్‌నెస్ రహస్యమని చెబుతున్న అక్షయ్ కుమార్. Photo Credit: Akshay Kumar/Instagram.

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ఆయా విష‌యాల్లో ఫ్యాన్స్ ఆయ‌న‌ను ప్ర‌శంసిస్తుంటారు కూడా. ఆయ‌న షూటింగ్‌ల‌కు కూడా టైముకు చేరుకుంటారు. చెప్పిన టైంలోగా షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్తారు. ఇక భోజ‌న విష‌యంలో తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. త్వ‌ర‌లో ప్ర‌సారం కానున్న వీల్ ఆఫ్ ఫార్చూన్ గేమ్ షోకు చెందిన ఓ ఎపిసోడ్‌లో పాల్గొన్న ప‌లువురికి అక్ష‌య్ త‌న ఆహార అల‌వాట్ల గురించి వివ‌రించారు. స్పూన్లు, ఫోర్క్ వంటి సాధ‌నాల‌తో భోజ‌నం చేస్తే తృప్తిగా ఉండ‌ద‌ని, చేత్తో తిన‌డ‌మే త‌న‌కు సంతృప్తిని ఇస్తుంద‌ని అక్ష‌య్ తెలిపారు. అందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు.

చేతుల‌తో ఆహారం తింటేనే ఆనందం..

స‌ద‌రు గేమ్ షో ఎపిసోడ్‌లో బెంగ‌ళూరుకు చెందిన ఇషాంజ‌లి, పూణెకు చెందిన అర్జున్‌, జైపూర్‌కు చెందిన కియారా అనే యువ‌తీ యువ‌కులు పాల్గొన‌గా అక్ష‌య్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. కియారాతో నిశ్చితార్థం చేసుకున్న ఓ యువకుడు ఆమెతో గ‌తంలో జ‌రిగిన ఓ అనుభ‌వాన్ని వివ‌రించాడు. ఒక డేట్ స‌మ‌యంలో కియారా చికెన్ టంగ్డీని ఫోర్క్‌, నైఫ్‌తో తిన‌డం చూసి త‌న‌కు ఆశ్చ‌ర్యంగా అనిపించింద‌ని తెలిపాడు. అయితే దీనిపై స్పందించిన అక్ష‌య్ మాట్లాడుతూ తాను వెజిటేరియ‌న్ అని, మాంసాహారం ముట్ట‌న‌ని, అయిన‌ప్ప‌టికీ తాను చేతుల్తోనే ఆహారం తింటాన‌ని తెలిపారు. చేతుల‌తో ఆహారం తిన‌డంలో ఉన్న ఆనందం మ‌రెక్క‌డా ఉంద‌ని అన్నారు. లోహంతో త‌యారైన వాటిని నోట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల ఆ అనుభ‌వం తగ్గుతుంద‌ని అన్నారు.

గుజ‌రాతీ వంట‌లు అంటే ఇష్టం..

భోజ‌నం చేసే ముందు చేతులు, కాళ్లు క‌డుక్కుని ఆహారంతో నేరుగా మ‌మేకం అవ‌డం రుచిని మ‌రింత పెంచుతుంద‌ని అక్ష‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు. అన్నం, పెరుగు, ప‌ప్పు, జీరా ఆలూ, బెండ‌కాయ‌, గోబీ వంటి ఆహారాల‌ను చేతుల్తో క‌లిపి తిన‌డం అద్భుతంగా ఉంటుంద‌ని, అలాగే మ‌న మ‌న‌సుకు న‌చ్చిన వారికి భోజ‌నం పెట్ట‌డం ద్వారా ప్రేమ పెరుగుతుంద‌ని తెలిపారు. అయితే అక్ష‌య్ ఇలా చెప్ప‌డం ఇదే మొద‌టిసారి కాదు, గ‌తంలో ఆయ‌న అనేక సార్లు ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆయ‌న త‌న షోల‌లో ఎల్ల‌ప్పుడూ భార‌తీయ సంప్ర‌దాయాల‌ను ప్రోత్స‌హిస్తుంటారు. గ‌త ఎపిసోడ్‌లో ఆయ‌న గుజ‌రాతీ వంట‌కాలంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఉండియూ లేదా గుజ‌రాతీ థాలీ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని అన్నారు. అయితే అక్ష‌య్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో నెటిజ‌న్లు సైతం ఏకీభ‌విస్తున్నారు. చాలా మంది సంప్ర‌దాయాల‌ను మ‌రిచి ఆహార‌పు అల‌వాట్ల‌ను పాటిస్తూ అనారోగ్యాల బారిన ప‌డుతున్నార‌ని, అక్ష‌య్ చెప్పిన ప‌ద్ధ‌తుల‌తో సంప్ర‌దాయాన్ని పాటించిన‌ట్లు అవ‌డ‌మే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

గమనిక/Disclaimer: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల విషయంలో వ్యక్తిగత అవసరాలను బట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment