ప్రశాంత్ వర్మ పౌరాణిక చిత్రం నుంచి ప్రభాస్ అవుట్?

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు చర్చకు వస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. భారీ విజన్‌కు బదులుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, నటులు తప్పుకోవడం, ఆర్థిక భేదాభిప్రాయాలపై వార్తలు వినిపిస్తున్నాయి.

February 19, 2026 5:35 PM
Prabhas and director Prasanth Varma regarding the mythological film exit reports.
ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ తప్పుకున్నారంటూ ప్రచారం. Photo Credit: Prabhas/Prasanth Varma/X/Instagram.

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు చర్చకు వస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. భారీ విజన్‌కు బదులుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, నటులు తప్పుకోవడం, ఆర్థిక భేదాభిప్రాయాలపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు ప్రభాస్ తో అనుకున్న ప్రాజెక్ట్ కూడా చేరిన‌ట్లు తెలుస్తోంది.

ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై అనిశ్చితి..?

సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల ప్ర‌కారం.. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కలయికలో ఓ మైథలాజికల్ చిత్రం బక (Baka) రూపొందనుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ బకాసురుడి పాత్రలో కనిపిస్తారని, చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోందని సమాచారం. కొన్ని నెలల క్రితం ప్రభాస్‌తో టెస్ట్ షూట్ కూడా జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ టెస్ట్ షూట్ తర్వాత ప్రభాస్ పూర్తిగా సంతృప్తి చెందలేదని, అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఇరు పక్షాల నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ సినిమా ముందుకు వెళ్లే అవకాశాలు ప్రస్తుతం క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మకు మరో ఎదురుదెబ్బ..?

అయితే ప్ర‌భాస్ త‌ప్పుకున్న వార్తే నిజమైతే ఇది ప్రశాంత్ వర్మకు వరుసగా మరో ఎదురుదెబ్బగా మారుతుంది. ఇప్పటికే రణవీర్ సింగ్ తో అనుకున్న బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్, అలాగే నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కూడా నిలిచిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బ‌క‌ సినిమా అయితే కల్కి 2898 ఏడీ: పార్ట్ 2, సలార్ పార్ట్ 2లకు ముందే సెట్స్‌పైకి వెళ్లనుందని ప్రచారం జరగడంతో తాజా పరిణామం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.

జై హ‌నుమాన్‌పైనే ఆశ‌లు..?

ప్రశాంత్ వర్మ చివరి చిత్రం హనుమాన్ 2024 జనవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాతోనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)కి పునాది పడింది. ఆయన తదుపరి నిర్ధారిత దర్శకత్వం జై హనుమాన్ కాగా, ఇందులో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ అనిశ్చితి వార్త నిజ‌మే అయితే ప్రశాంత్ వర్మ కెరీర్‌పై ప్రశ్నార్థకాలు నెల‌కొనే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ జై హనుమాన్‌ వంటి భారీ ప్రాజెక్ట్‌పై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment