ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు ఎనిమిది వారాల పాటు విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

January 30, 2026 4:07 PM
Prabhas The Raja Saab movie OTT streaming partner Jio Hotstar
ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. Photo Credit: The RajaSaab/Social Meida/Jio Hotstar.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు ఎనిమిది వారాల పాటు విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ది రాజా సాబ్ ఓటీటీ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ తేదీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

హిందీలో ఇప్పుడే కాదు..

ఓటీటీలో ది రాజా సాబ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది. అయితే, హిందీ వెర్షన్ ఈ దశలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ది రాజా సాబ్ 2026లో ప్రభాస్ విడుదల చేసిన మొదటి చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన మరో చిత్రం ఫౌజీ, ఈ ఏడాది దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. థియేటర్లలో పెద్ద‌గా వసూళ్లను సాధించ‌ని ది రాజా సాబ్, ఓటీటీలోనూ అయినా ఆదరణ పొందుతుందా అన్నది చూడాలి. అధికారిక ఓటీటీ విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment