New Rule On Gold : బంగారం ధరల హెచ్చు తగ్గులు మనం గమనిస్తూనే ఉన్నాం. ఒకరోజు పెరిగిన బంగారం ధరలు మరో రోజు తగ్గడం వెంటనే పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 22న) బంగారం , వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇలా బంగారం హెచ్చు తగ్గులకి కారణం పన్నులు, రవాణా ఖర్చులు, స్థానికంగా ఉన్న డిమాండ్‌తో పాటు అనేక ఇతర విషయాలు బంగారం ధరపై ప్రభావం చూపిస్తాయి. అయితే తక్కువ పన్నులు, బలమైన మార్కెట్ పోటీ ఉన్న రాష్ట్రాలు తక్కువ ధరకు బంగారాన్ని అందిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం.
ఈ క్రమంలో బంగారంపై ‘వన్ నేషన్ – వన్ రేట్’ పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా బంగారం ధరలు ఒకేలా ఉంటాయి. 2024 సెప్టెంబర్‌లో జరిగే సమావేశంలో ఈ విధానంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలుతో మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుంది. బంగారంపై ఇష్టానుసారంగా ధరలు వసూలు చేసే ధోరణికి అడ్డుకట్ట పడనుంది. ఈ పాలసీ వలన ధరల్లో వ్యత్యాసం లేకపోవడం వల్ల ఎటువంటి అపోహలు లేకుండా పసిడిని కొనుగోలు చేస్తారు. బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ నిబంధనలని అమలు చేయడం ద్వారా ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాలలో కేంద్ర ప్రభుత్వమే బంగారాన్ని విక్రయిస్తుంది.
బంగారం ధరల్లో వ్యత్యాసం తగ్గడం వల్ల దాని రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు బంగారంపై ఇష్టానుసారంగా ధరలు వసూలు చేసే ధోరణికి అడ్డుకట్ట పడనుంది. స్థానిక జ్యువెల్లరీ సంఘాలు వాటి పరిధిలో బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పసిడి ధరలను ప్రభావితం చేసే మరో అంశం బంగారం నాణ్యత. నాణ్యతను బట్టి బంగారం ధర ఉంటుంది. బంగారం దిగుమతిపై భారత ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ, సుంకాలు కూడా దాని ధరను ప్రభావితం చేస్తాయి. దిగుమతి సుంకాలను బట్టి పసిడి ధర ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో బంగారంపై దిగుమతి సుంకం 10 శాతం, పన్ను 3 శాతం ఉంటుంది.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…