---Advertisement---

New Rule On Gold : కొత్త నిర్ణ‌యం తీసుకున్న భార‌త ప్ర‌భుత్వం.. త్వరలో ‘వన్‌ నేషన్‌ వన్ రేట్’ పాలసీ అమలు..?

January 15, 2026 9:13 PM
---Advertisement---

New Rule On Gold : బంగారం ధ‌ర‌ల హెచ్చు త‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఒక‌రోజు పెరిగిన బంగారం ధ‌ర‌లు మ‌రో రోజు త‌గ్గడం వెంట‌నే పెరిగిపోవ‌డం వంటివి జ‌రుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 22న) బంగారం , వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇలా బంగారం హెచ్చు త‌గ్గుల‌కి కార‌ణం పన్నులు, రవాణా ఖర్చులు, స్థానికంగా ఉన్న డిమాండ్​తో పాటు అనేక ఇతర విషయాలు బంగారం ధరపై ప్రభావం చూపిస్తాయి. అయితే తక్కువ పన్నులు, బలమైన మార్కెట్ పోటీ ఉన్న రాష్ట్రాలు తక్కువ ధరకు బంగారాన్ని అందిస్తుండ‌డం మనం చూస్తూ ఉన్నాం.

ఈ క్ర‌మంలో బంగారంపై ‘వన్ నేషన్ – వన్ రేట్’ పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా బంగారం ధరలు ఒకేలా ఉంటాయి. 2024 సెప్టెంబర్‌లో జరిగే సమావేశంలో ఈ విధానంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలుతో మార్కెట్‌లో పారదర్శకత పెరుగుతుంది. బంగారంపై ఇష్టానుసారంగా ధరలు వసూలు చేసే ధోరణికి అడ్డుకట్ట పడనుంది. ఈ పాల‌సీ వ‌ల‌న ధరల్లో వ్యత్యాసం లేకపోవడం వల్ల ఎటువంటి అపోహలు లేకుండా పసిడిని కొనుగోలు చేస్తారు. బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ నిబంధ‌న‌లని అమ‌లు చేయ‌డం ద్వారా ముంబై, చెన్నై, కోల్‌క‌తా, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌లో కేంద్ర ప్ర‌భుత్వ‌మే బంగారాన్ని విక్ర‌యిస్తుంది.

New Rule On Gold government may implement one nation one rate
New Rule On Gold

బంగారం ధరల్లో వ్యత్యాసం తగ్గడం వల్ల దాని రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు బంగారంపై ఇష్టానుసారంగా ధరలు వసూలు చేసే ధోరణికి అడ్డుకట్ట పడనుంది. స్థానిక జ్యువెల్లరీ సంఘాలు వాటి పరిధిలో బంగారం ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పసిడి ధరలను ప్రభావితం చేసే మరో అంశం బంగారం నాణ్యత. నాణ్యతను బట్టి బంగారం ధర ఉంటుంది. బంగారం దిగుమతిపై భారత ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ, సుంకాలు కూడా దాని ధరను ప్రభావితం చేస్తాయి. దిగుమతి సుంకాలను బట్టి పసిడి ధర ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో బంగారంపై దిగుమతి సుంకం 10 శాతం, పన్ను 3 శాతం ఉంటుంది.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now