స‌మాచారం

Loan To Farmers : రైతుల‌కి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే త‌క్కువ వ‌డ్డీకే రూ.3ల‌క్ష‌ల వ‌రకు రుణం..

Loan To Farmers : ఈ రోజుల్లో రైతులు ప‌డే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో క‌ష్ట‌ప‌డి పంట పండించిన కూడా చేతికి వ‌చ్చే వ‌ర‌కు న‌మ్మకం లేదు. అయితే రైతులు పంట‌ సాగు చేయాలంటే ముందుగా పెట్టుబడికి సరిపడా డబ్బులు ఉండాలి. ఇందుకోసం చాలా మంది రుణాలు తీసుకుంటారు. విత్తనాల కోసం, ఎరువుల కోసం, పురుగు మందులు, ఇతర పనులు ఇలా దేనికైనా పెట్టుబడి కోసం చేసే అప్పులు అంచ‌నాలని మించిపోతుండ‌డంతో ఒక్కోసారి రైతు ఆత్మ‌హ‌థ్య‌లు కూడా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రైతుల ప‌రిస్థితుల‌ని అర్దం చేసుకున్న ప్ర‌భుత్వాలు ఎన్నో పథకాల్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6 వేలు పంట సాయం అందిస్తోంది.

ఇదే సమయంలో ఆయా రాష్ట్రాలు కూడా పంట సాయం కోసం పథకాలు తీసుకొచ్చాయి.ఈ క్ర‌మంలోనే కిసాన్ క్రెడిట్ కార్డు అనే ప‌థకం కూడా వ‌చ్చింది. దీనితో.. రైతులు చాలా తక్కువ వడ్డీకి స్వల్పకాలిక లోన్ పొందొచ్చు. అయితే దీనికి ఎవరు అర్హులు.. అప్లై ఎలా చేసుకోవాలి.. వంటి వివరాలు చూస్తే… సాగు కోసం ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఒకసారి ఈ కార్డు తీసుకుంటే ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. ఐదేళ్ల కాలంలో రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. దీనికి వడ్డీ 4 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది.

Loan To Farmers : రైతుల‌కి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే త‌క్కువ వ‌డ్డీకే రూ.3ల‌క్ష‌ల వ‌రకు రుణం..

ఇక ఈ లోన్ ఇచ్చే ముందు.. రైతు ఆదాయం, గత రుణ చరిత్ర, వ్యవసాయ భూమి ఎంత ఉంది.. వంటి అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.దానిని బ‌ట్టే ఎంత లోన్ ఇవ్వాల‌నేది నిర్ణ‌యిస్తారు. వాస్తవంగా వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. తీసుకున్న రుణం ఏడాది లోపు చెల్లించే రైతులకు వడ్డీ రేటు 3 శాతం తగ్గిస్తారు. అందుకే కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు 4 శాతానికి మించదు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతు మరణిస్తే.. బీమా కంపెనీ నుంచి అతని కుటుంబానికి రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తారు. ఇక శాశ్వ‌త వైకల్యం ఉంటే రూ. 50 వేల వరకు సాయం వస్తుంది. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు సేవింగ్స్ అకౌంట్, డెబిట్ కార్డు, స్మార్ట్ కార్డు అందిస్తారు. దీంట్లో పొదుపుపై వడ్డీ కూడా వస్తుంది. ఈ కార్డ్ డిట్ కార్డు కోసం అప్లై చేసుకునే రైతు వయసు 18-75 ఏళ్ల మధ్య ఉండాలి.

కిసాన్ క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ముందుగా ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో.. ఆ బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోంపేజీలో కనిపించే ఆప్షన్స్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అప్లై బటన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంత‌రం మీ వివ‌రాల‌ని బ్యాంక్ ధృవీక‌రిస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే.. కొన్ని రోజుల్లో కేసీసీ జారీ అవుతుంది. ఆఫ్‌లైన్‌లో అయితే మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేసీసీ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి. ఆ ఫారం కోసం, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి.. బ్యాంకులో సమర్పించాలి. మీ అప్లికేషన్ ఫారంను బ్యాంక్ ప్రాసెస్ చేసి.. కొన్ని రోజుల్లోనే కేసీసీ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM