స‌మాచారం

Gruha Jyothi Scheme : గృహ‌జ్యోతి ల‌బ్ధిదారుల‌కు షాక్‌.. జీరో క‌రెంట్ బిల్ క‌ట్‌..!

Gruha Jyothi Scheme : గ‌తంలో మాదిరిగా కాకుండా ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించేందుకు ప్ర‌స్తుతం అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, అటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మోస‌పూరిత హామీల‌ను ఇస్తే ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు. ప్ర‌భుత్వాల‌ను కూల్చేస్తున్నారు. క‌నుక రాజ‌కీయ పార్టీలు స్కీమ్‌ల‌ను ప్ర‌క‌టించే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని మ‌రీ స్కీమ్‌ల‌ను అందిస్తున్నాయి. అయితే తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి అద్భుత‌మైన ప‌థ‌కాల‌ను అందిస్తామ‌ని చెప్పి సీఎం అయ్యారు. అందులో గృహ జ్యోతి కూడా ఉంది.

ఈ ప‌థ‌కం కింద అర్హులైన పేద‌ల‌కు ఉచితంగా గృహావ‌స‌రాల‌కు క‌రెంటును అందిస్తారు. 200 యూనిట్లు అంత‌కన్నా త‌క్కువ విద్యుత్‌ను వాడుకునే పేద‌లు ఇందుకు అర్హులు. 2024 ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ స్కీమ్‌ను ప్ర‌క‌టించింది. దీంతోపాటు రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్‌ను కూడా అదే రోజు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికీ మార్చి మొద‌టి వారం నుంచి సున్నా బిల్లులు వ‌స్తున్నాయి. ఇక ఇందుకు గాను బిల్లింగ్ మెషిన్ల‌లో ప్ర‌త్యేక‌మైన సాఫ్ట్‌వేర్‌ను అమ‌ర్చారు.

Gruha Jyothi Scheme

కాగా ప్ర‌జాపాల‌న‌లో ఇచ్చిన ద‌ర‌ఖాస్తు, రేష‌న్ కార్డు ఆధారంగా అర్హులైన వారికి బిల్లింగ్ మెషిన్‌లో నుంచి ఆటోమేటిక్‌గా జీరో బిల్ వ‌చ్చేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీంతో ఇప్ప‌టికే చాలా మందికి జీరో బిల్స్ వ‌స్తున్నాయి. అయితే గృహ‌జ్యోతి ప‌థ‌కంపై వేస‌వి కాలం ప్ర‌భావం ప‌డింది. ఈ ప‌థ‌కానికి అర్హులైన వారిలో కొంద‌రికి గృహ‌జ్యోతి స్కీం క‌ట్ అయింది. దీంతో వినియోగ‌దారులు షాక‌వుతున్నారు. రూల్ ప్ర‌కారం 200 యూనిట్లు లేదా అంత‌క‌న్నా త‌క్కువ క‌రెంటు వాడితేనే జీరో బిల్ వ‌స్తుంది. 200 మీద ఒక్క యూనిల్ పెరిగినా స‌రే జీరో బిల్ రాదు, క‌రెంటు బిల్లు పూర్తిగా వ‌స్తుంది, దాన్ని క‌ట్టాల్సి ఉంటుంది.

అయితే మార్చి నెల వ‌ర‌కు బాగానే ఉన్నా ఆ త‌రువాత నుంచి ఎండ‌లు ముదిరాయి క‌నుక ఫ్యాన్లు, కూల‌ర్ల‌ను చాలా మంది వాడారు. దీంతో స‌హ‌జంగానే క‌రెంటు బిల్లు ఎక్కువ‌గా వ‌చ్చింది. ఫ‌లితంగా వారు గృహ‌జ్యోతి ప‌థ‌కానికి అన‌ర్హులు అయ్యారు. 200 యూనిట్ల పైన విద్యుత్ వాడ‌డంతో బిల్లు పూర్తిగా వ‌చ్చింది. దీంతో ఏప్రిల్‌, మే నెల‌ల‌కు బిల్లు వ‌చ్చింది. జీరో బిల్ రాలేదు. ఫ‌లితంగా పూర్తి బిల్లును క‌ట్టాల్సి వ‌స్తుంది. ఇది చూసిన వినియోగ‌దారులు షాక‌వుతున్నారు. కానీ అధికారులు మాత్రం రూల్ ప్ర‌కార‌మే బిల్ వ‌చ్చింద‌ని, 200 యూనిట్ల లోపు ఉంటేనే జీరో బిల్ వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా కొంద‌రు ల‌బ్ధిదారుల‌కు ఈ ప‌థ‌కం క‌ట్ అయిన కార‌ణంగా వారు విచారంగా ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌భుత్వం ఇచ్చే ప‌థ‌కాలు బాగానే ఉంటాయి కానీ వాటిని ఆచి తూచి వాడాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM