మనదేశంలో అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన‌ మొట్టమొదటి 5జీ ల్యాప్ టాప్..!

April 26, 2021 11:34 PM

ఏసర్ కంపెనీ మన దేశంలో మొట్టమొదటి సారిగా  జీ ల్యాప్ టాప్ లను లాంచ్ చేసింది. అదే ఏసర్ స్పిన్7 ల్యాప్ టాప్. ఇందులో 14 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు 360 డిగ్రీల కోణంలో ఈ డిస్ ప్లే తిరగనుంది. ఈ సందర్భంగా ఏసర్ కంపెనీ వ్యవస్థాపకులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా 5 జీ ల్యాప్ టాప్ ఇదేనని ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8సీఎక్స్ జెన్ 2 5జీ ప్లాట్‌ఫాంను అందించారు.

ఏసర్ స్పిన్ 7 ధర మనదేశంలో .1,34,999గా ఉంది. ఈ అధునాతన ల్యాప్ టాప్ లు ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఏసర్ ఆన్ లైన్ స్టోర్, ఇతర భాగస్వామ్య స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో స్టీమ్ బ్లూ రంగు అందుబాటులో ఉంది. ఈ ఒక్క కలర్ వేరియంట్ ను మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది.

ఈ 5 జీ ల్యాప్ టాప్ లో 4జీ, వైఫై 6, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 56WHR బ్యాటరీని అమర్చారు.ఏసర్ స్పిన్ 7 టచ్ జెస్చర్లను కూడా సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.59 సెంటీమీటర్లుగానూ, బరువు 1.4 కేజీలుగానూ ఉంది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment