పబ్‌జి ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీటా వెర్షన్‌ను క్రాఫ్టన్ కంపెనీ ఇప్పటికే విడుదల చేసిన విషయం విదితమే. 2 రోజుల కిందటే ఈ వెర్షన్ లాంచ్ అయింది. అయితే కేవలం కొందరికే ఇది అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ వెర్షన్‌ను అందరికీ అందుబాటులో ఉంచారు. ఈ విషయాన్ని క్రాఫ్టన్ స్వయంగా తెలిపింది. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌కు గాను బీటా వెర్షన్‌ను ఇప్పుడు అందరూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా https://play.google.com/apps/testing/com.pubg.imobile/join అనే లింక్‌ను మొబైల్‌లో సందర్శించాలి. తరువాత అందులో ఇచ్చిన బికమ్ ఎ టెస్టర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో గేమ్ యూజర్లకు లభిస్తుంది. తరువాత కొద్ది నిమిషాల్లోగా బీటా వెర్షన్ ను గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గత 10 నెలలుగా పబ్‌జి ప్రియులు ఈ గేమ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పబ్‌జి బ్యాన్ కావడంతో వారు తీవ్ర నిరాశ నిస్ఫృహలకు లోనయ్యారు. కానీ ఈ గేమ్ రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తమ ఫేవరెట్ గేమ్‌ను ఆడే అవకాశం దక్కినందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ గేమ్‌ను పూర్తి స్థాయిలో ఎప్పుడు లాంచ్ చేసేది క్రాఫ్టన్ వెల్లడించలేదు. కానీ మరో 10 రోజుల్లో లాంచ్ చేస్తారని సమాచారం అందుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…