ప‌బ్‌జి ప్రియుల‌కు గుడ్ న్యూస్.. బీటా వెర్ష‌న్ వ‌చ్చేసింది.. ఇప్పుడు అంద‌రికీ అందుబాటులో..!

June 20, 2021 2:17 PM

ప‌బ్‌జి ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా బీటా వెర్ష‌న్‌ను క్రాఫ్ట‌న్ కంపెనీ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. 2 రోజుల కింద‌టే ఈ వెర్ష‌న్ లాంచ్ అయింది. అయితే కేవ‌లం కొంద‌రికే ఇది అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ వెర్ష‌న్‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచారు. ఈ విష‌యాన్ని క్రాఫ్ట‌న్ స్వ‌యంగా తెలిపింది. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌కు గాను బీటా వెర్ష‌న్‌ను ఇప్పుడు అంద‌రూ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

battlegrounds mobile india beta now available to all users

ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా https://play.google.com/apps/testing/com.pubg.imobile/join అనే లింక్‌ను మొబైల్‌లో సంద‌ర్శించాలి. త‌రువాత అందులో ఇచ్చిన బిక‌మ్ ఎ టెస్ట‌ర్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. దీంతో గేమ్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుంది. త‌రువాత కొద్ది నిమిషాల్లోగా బీటా వెర్ష‌న్ ను గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

గ‌త 10 నెల‌లుగా ప‌బ్‌జి ప్రియులు ఈ గేమ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌బ్‌జి బ్యాన్ కావ‌డంతో వారు తీవ్ర నిరాశ నిస్ఫృహ‌ల‌కు లోన‌య్యారు. కానీ ఈ గేమ్ రావ‌డంతో వారు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోసారి త‌మ ఫేవ‌రెట్ గేమ్‌ను ఆడే అవ‌కాశం ద‌క్కినందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ గేమ్‌ను పూర్తి స్థాయిలో ఎప్పుడు లాంచ్ చేసేది క్రాఫ్ట‌న్ వెల్ల‌డించ‌లేదు. కానీ మ‌రో 10 రోజుల్లో లాంచ్ చేస్తార‌ని స‌మాచారం అందుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment