నిక్-ప్రియాంక హోలీ సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ త్రోబ్యాక్ ఫోటో!

దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేప‌థ్యంలో ప్రముఖ పాప్‌ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

March 4, 2026 6:05 PM
Nick Jonas and Priyanka Chopra celebrating Holi with colors.
హోలీ వేడుకల్లో రంగులతో మునిగిపోయిన నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా దంపతులు. Photo Credit: Nick Jonas/Instagram.

దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేప‌థ్యంలో ప్రముఖ పాప్‌ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. బుధవారం (మార్చి 4, 2026) ఉదయం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేస్తూ, దాన్ని తన ఇష్టమైన హోలీ క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఈ ఫొటో కొద్ది సేప‌ట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోలో నిక్ జోనాస్, ప్రియాంక‌ చోప్రా ఇద్దరూ రంగు రంగుల గులాల్‌తో నిండిపోయి హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నట్లు కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రియాంక‌ ఎంతో అందంగా కనిపిస్తూ నిక్‌ను చేతితో హత్తుకుని చిరునవ్వుతో కెమెరాకు పోజిచ్చారు.

కామెంట్ చేసిన నిక్ జోనాస్‌..

ఈ ఫొటోను షేర్ చేస్తూ నిక్ జోనాస్ ఓ కామెంట్ కూడా పెట్టారు. నా ఇష్టమైన హోలీ జ్ఞాపకాలలో ఒకటి. అందరికీ హ్యాపీ హోలీ! అని రాశారు. కాగా 2018లో వివాహం చేసుకున్న ఈ జంట క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం రెండు విధాలుగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకరి సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తూ అనేక పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. డీపావళి, క్రిస్మస్, హోలీ వంటి పండుగలను ఈ జంట తరచుగా కలిసి జరుపుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా ప్రియాంక‌ చోప్రా ప్రస్తుతం తన తాజా చిత్రం ది బ్ల‌ఫ్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రంలో ఆమె ఖడ్గ యుద్ధాలు, గన్ ఫైట్లు వంటి తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారు.

ది బ్ల‌ఫ్ చిత్రంలో ఆమెతో పాటు కార్ల్ అర్బ‌న్ కూడా నటించారు. చిత్రానికి ఫ్రాంక్ ఇ ఫ్ల‌వ‌ర్స్ దర్శకత్వం వహించగా, ఆంథోనీ రుసో, జో రుసో, ఏంజెలా రుసో-ఒట్సోట్ లు తమ ఏజీబీవో బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో విడుదలై ప్రియాంక‌ చోప్రా ప‌వ‌ర్‌ఫుల్‌ నటనతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment