గొప్పల కోసం అప్పులు చేయొద్దు.. యువతకు మంచు మనోజ్ హితవు!

గొప్ప‌ల‌కు పోయి అప్పులు చేసి యువ‌త క‌ష్టాల పాలు కావొద్ద‌ని, విలాసాల‌కు దూరంగా ఉండాల‌ని న‌టుడు మంచు మ‌నోజ్ సూచించారు. ఓ యూనివర్సిటీలో జ‌రిగిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆయ‌న యువ‌త‌కు ప‌లు ముఖ్య‌మైన సూచ‌న‌లు చేశారు.

February 28, 2026 8:08 PM
Actor Manchu Manoj addressing students at a university event.
యూనివర్సిటీ వేడుకలో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్న మంచు మనోజ్. Photo Credit: Manchu Manoj/X.

గొప్ప‌ల‌కు పోయి అప్పులు చేసి యువ‌త క‌ష్టాల పాలు కావొద్ద‌ని, విలాసాల‌కు దూరంగా ఉండాల‌ని న‌టుడు మంచు మ‌నోజ్ సూచించారు. ఓ యూనివర్సిటీలో జ‌రిగిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆయ‌న యువ‌త‌కు ప‌లు ముఖ్య‌మైన సూచ‌న‌లు చేశారు. నేటి త‌రం యువ‌త ఎక్కువ‌గా విలాసాల‌ను కోరుకుంటూ ఖ‌రీదైన వ‌స్తువులు కావాల‌ని చూస్తున్నార‌ని, ఇందుకోసం అప్పులు చేస్తున్నార‌ని, ఇత‌రుల మెప్పు పొందేందుకు అప్పులు చేసి క‌ష్టాల పాల‌వుతున్నార‌ని మ‌నోజ్ అన్నారు. ఎవ‌రినో మెప్పించ‌డం కోసం అప్పుల‌ను చేసి స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకోవ‌డం స‌రికాద‌న్నారు. యువ‌త చ‌దువు, కెరీర్‌పై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ఈ సంద‌ర్బంగా తాను వాడుతున్న ఓ పాత ఐఫోన్ గురించి చెప్పుకొచ్చారు.

ఇప్ప‌టికీ పాత ఐఫోన్ వాడ‌కం..

తాను ఇప్ప‌టికీ ఇంకా పాత ఐఫోన్‌ను ఉప‌యోగిస్తున్నాన‌ని మంచు మ‌నోజ్ అన్నారు. కానీ ఆ విష‌యం ఎవ‌రికీ తెలియ‌ద‌ని, ఎందుకంటే ఆ ఫోన్‌కు తాను ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ క‌వ‌ర్ వేసి వాడుతున్నాన‌ని తెలిపారు. అంతేకాదు, ఆ ఫోన్‌ను క‌వ‌ర్‌లోంచి తీసి చూపించారు కూడా. ఇత‌రుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాల‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని యువ‌త‌కు సూచ‌న‌లు చేశారు. డ‌బ్బును వృథా చేయ‌వ‌ద్ద‌ని, ఉన్న‌దాంతో తృప్తిగా ఉండాల‌న్నారు. కాగా మంచు మనోజ్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు చెందిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. మ‌నోజ్ ఎల్ల‌ప్పుడూ ఇలా సామాజిక అంశాల‌పై ఎక్కువ‌గా స్పందిస్తున్నారు. స‌మాజంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను అంద‌రికీ తెలిసేలా చేస్తుంటారు. ఆయ‌న ఏ విష‌యాన్న‌యినా స‌రే కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడుతారు. అలాగే త‌న మాట‌లు, చేష్ట‌ల‌తోనూ న‌వ్విస్తుంటారు. అయితే మ‌నోజ్ చెప్పిన సూచ‌న‌ల‌ను చాలా మంది పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు. ఆయ‌న చెప్పింది నిజ‌మేన‌ని ఏకీభ‌విస్తున్నారు.

ఇక మనోజ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న డేవిడ్ రెడ్డి అనే మూవీలో న‌టిస్తున్నారు. ఇందులో ఆయ‌న బ్రిటిష్ క్రూర పాల‌న‌కు ఎదురొడ్డి పోరాడిన యోధుడు డేవిడ్ రెడ్డి పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండ‌గా, పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. న‌ల్ల‌గంగుల వెంక‌ట్ రెడ్డి, భ‌ర‌త్ మోటుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌నుమ రెడ్డి య‌క్కంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, మారియా ర్య‌బోష‌ప్క హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment