ఐపీఎల్ 2021: సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై బెంగ‌ళూరు విజ‌యం..!

April 14, 2021 11:20 PM

చెన్నైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2021 టోర్నీ 6వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు నిర్దేశించిన 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా హైద‌రాబాద్ ఛేదించ‌లేక చ‌తికిల‌బ‌డింది. పేల‌వ‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. దీంతో హైద‌రాబాద్‌పై బెంగ‌ళూరు 6 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది.

bangalore won by 6 runs against hyderabad in ipl 2021 6th match

మ్యాచ్‌లో టాస్ గెలిచి హైద‌రాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగ‌ళూరు బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌, కోహ్లిలు రాణించారు. 41 బంతులు ఆడిన మాక్స్‌వెల్ 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 59 ప‌రుగులు చేయ‌గా 29 బంతుల్లో కోహ్లి 4 ఫోర్ల‌తో 33 ప‌రుగులు చేశాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో జేస‌న్ హోల్డ‌ర్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ర‌షీద్ ఖాన్ 2 వికెట్లు తీయ‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, షాబాజ్ న‌దీమ్‌, టి.న‌ట‌రాజ‌న్‌లకు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో డేవిడ్ వార్న‌ర్‌, మ‌నీష్ పాండేలు రాణించారు. 37 బంతులు ఆడిన వార్న‌ర్ 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 54 ప‌రుగులు చేయ‌గా, 39 బంతులు ఆడిన పాండే 2 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 38 ప‌రుగులు చేశాడు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో షాబాద్ అహ్మ‌ద్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ లు చెరో 2 వికెట్లు తీశారు. కైలీ జేమిస‌న్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment