SPG Commando : గత కొద్ది రోజులుగా ప్రధాని మోదీ భద్రతపై అనేక వివాదాలు నెలకొంటున్న విషయం విదితమే. పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వెళ్లినప్పుడు ఆయన అక్కడి ఓ ఫ్లై ఓవర్‌పై 20 నిమిషాల పాటు ఆగిపోయారు. అదే రహదారికి కొద్ది దూరంలో రైతులు నిరసన తెలియజేస్తుండడంతో భద్రతా కారణాల వల్ల మోదీ ముందుకు కొనసాగలేక టూర్‌ను రద్దు చేసుకుని తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం వివాదంగా మారింది.
పంజాబ్ ప్రభుత్వం మోదీకి భద్రతను కల్పించడంలో విఫలమైందంటూ ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నత స్థాయి అధికారుల విచారణ నడుస్తోంది. దీంతోపాటు సుప్రీం కోర్టులోనూ కేసు నడుస్తోంది. అయితే ప్రధానికి రక్షణ కల్పించే ఎస్‌పీజీ కమాండోల గురించి అందరికీ తెలుసు. ఈ వ్యవస్థను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె భద్రత అధికారులే ఆమెను కాల్చి చంపారు. దీంతో అప్పటి నుంచి ప్రధాని భద్రత బాధ్యతలను ఎస్‌పీజీయే పర్యవేక్షిస్తోంది. ఇందిరా గాంధీ హత్య తరువాతే ఎస్‌పీజీని ఏర్పాటు చేశారు.
ఇక ఎస్‌పీజీలో పనిచేయాలంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఏమీ ఉండదు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లకు చెందిన సీనియర్, జూనియర్ ఆఫీసర్లను ఎస్‌పీజీలోకి తీసుకుంటారు. వారికి రాటుదేలేలా శిక్షణను అందించి తరువాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎస్‌పీజీలో 3వేల మందికి పైగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇక ఒక్కో ఎస్‌పీజీ అధికారి కేవలం ఒక ఏడాది పాటు మాత్రమే విధి నిర్వహణలో ఉంటాడు. తరువాత మార్చేస్తారు. ఎస్‌పీజీలో ఒక ఏడాదిపాటు పనిచేశాక ఇతర విభాగాలకు మారుస్తారు. ఎస్‌పీజీలో పనిచేయడం అంటే ప్రధాని మోదీకి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. కనుక చాలా మెరికలైన కమాండోలనే అందుకు నియమిస్తారు. ఎటు వైపు నుంచి ఆపద వచ్చినా ఇట్టే పసిగట్టి ప్రధాని ప్రాణాలను రక్షించేందుకు వీరు ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు.
ఎస్‌పీజీ కమాండోలు ప్రధానితోపాటు ఆయన ఇల్లు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తారు. ఒక్కో ఎస్‌పీజీ కమాండోకు ఎప్పుడూ ఒకటే డ్యూటీ ఉండదు. తరచూ మారుస్తుంటారు. ఇక వీరి వేతనం విషయానికి వస్తే వీరికి అన్ని రకాల అలవెన్స్‌లు కలిపి నెలకు రూ.84వేల నుంచి రూ.2.50 లక్షల వరకు వేతనం ఉంటుంది. బోనస్ , ఇతర అలవెన్స్‌లు, సదుపాయాలను కూడా కల్పిస్తారు. వీరికి డ్రెస్ అలవెన్స్ కింద ఏడాదికి రూ.27,800 ఇస్తారు. ఇలా ఎస్‌పీజీ కమాండోలు పనిచేస్తుంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…