ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి కొన్నాళ్లకే పెటాకులు అవుతుంది. ఏవో చిన్నా చితకా కారణాలకి కూడా వారు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ తన భర్త రోజూ స్నానం చేయడం లేదని డైవర్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పెళ్లైన 40 రోజులకే ఆమెకు విసుగొచ్చి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. మహిళ చెప్పిన కారణం విని అక్కడి సిబ్బంది కూడా షాకైపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన వెలుగు చూసింది . మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె భర్త నెలకు ఒకసారో రెండు సార్లో మాత్రమే స్నానం చేస్తాడట.
ఈ క్రమంలో అతడి శరీర దుర్గంధం భరించలేకపోతున్నానని ఆమె వాపోయింది. ఇంత అపరిశుభ్రంగా ఉండే వ్యక్తితో కలిసి ఉండలేనని స్పష్టం చేసింది.ఈ విషయంలో యువతి భర్తను ప్రశ్నించగా అతడి సమాధానం అధికారులను ఆశ్చర్యపరిచింది. తాను నెలకు ఒకటో రెండో మార్లు మాత్రమే స్నానం చేస్తానని అతడు ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించాడు. వారానికి ఒకసారి ఒంటిపై గంగాజలం జల్లుకుని అక్కడితో సరిపెడతానని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, తమకు పెళ్లైన తరువాత భార్య పోరు పడలేక 40 రోజుల్లో ఆరు సార్లు స్నానం చేశానంటూ అతను తెలియజేశాడు.
స్నానం విషయంలో నవ దంపతుల మధ్య తగాదాలు మొదలయ్యాయని కౌన్సెలర్ మీడియాకు తెలిపారు. ఈ గొడవలు భరించలేక యువతి తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. ఆ తరువాత భర్త కుటుంబంపై వారు కట్నం వేధింపుల కేసు కూడా పెట్టారని అన్నారు. డైవర్స్ కావాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఆ భర్త రోజూ స్నానం చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే, భార్య మాత్రం అతడితో కలిసుండేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మరోసారి కౌన్సెలింగ్‌కు రావాలని కౌన్సెలింగ్ సెంటర్ వారు ఆ దంపతులకు సూచించడంతో వారి దాంపత్య జీవితం ఎటు వైపు టర్నింగ్ తీసుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…