భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

January 15, 2026 9:13 PM

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి కొన్నాళ్ల‌కే పెటాకులు అవుతుంది. ఏవో చిన్నా చితకా కార‌ణాల‌కి కూడా వారు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మ‌హిళ త‌న భ‌ర్త రోజూ స్నానం చేయడం లేద‌ని డైవ‌ర్స్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. పెళ్లైన 40 రోజులకే ఆమెకు విసుగొచ్చి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. మహిళ చెప్పిన కారణం విని అక్కడి సిబ్బంది కూడా షాకైపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన వెలుగు చూసింది . మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె భర్త నెలకు ఒకసారో రెండు సార్లో మాత్రమే స్నానం చేస్తాడట.

ఈ క్ర‌మంలో అతడి శరీర దుర్గంధం భరించలేకపోతున్నానని ఆమె వాపోయింది. ఇంత అపరిశుభ్రంగా ఉండే వ్యక్తితో కలిసి ఉండలేనని స్పష్టం చేసింది.ఈ విష‌యంలో యువతి భర్తను ప్రశ్నించగా అతడి సమాధానం అధికారులను ఆశ్చర్యపరిచింది. తాను నెలకు ఒకటో రెండో మార్లు మాత్రమే స్నానం చేస్తానని అతడు ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించాడు. వారానికి ఒకసారి ఒంటిపై గంగాజలం జల్లుకుని అక్కడితో సరిపెడతానని ఆయ‌న చెప్పుకొచ్చాడు. అయితే, తమకు పెళ్లైన తరువాత భార్య పోరు పడలేక 40 రోజుల్లో ఆరు సార్లు స్నానం చేశానంటూ అత‌ను తెలియ‌జేశాడు.

wife demands divorce from husband because he did not bath for 30 days

స్నానం విష‌యంలో నవ దంపతుల మధ్య తగాదాలు మొదలయ్యాయని కౌన్సెలర్ మీడియాకు తెలిపారు. ఈ గొడవలు భరించలేక యువతి తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. ఆ తరువాత భర్త కుటుంబంపై వారు కట్నం వేధింపుల కేసు కూడా పెట్టారని అన్నారు. డైవర్స్ కావాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఆ భర్త రోజూ స్నానం చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే, భార్య మాత్రం అతడితో కలిసుండేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మరోసారి కౌన్సెలింగ్‌కు రావాలని కౌన్సెలింగ్ సెంటర్ వారు ఆ దంపతులకు సూచించ‌డంతో వారి దాంప‌త్య జీవితం ఎటు వైపు ట‌ర్నింగ్ తీసుకుంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now