మంగళవారం, జూన్ 30, 2026
క్రీడ‌లు

Yuvraj Singh : తండ్ర‌యిన మాజీ క్రికెటర్ యువ‌రాజ్ సింగ్‌.. మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచ్చిన యువీ భార్య హేజ‌ల్ కీచ్‌..!

Yuvraj Singh : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ తండ్ర‌య్యాడు. ఆయ‌న భార్య హేజ‌ల్ కీచ్ మ‌గ శిశువుకు జన్మ‌నిచ్చింది. ఈ మేర‌కు ఈ దంప‌తులు ఈ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.…

Yuvraj Singh : తండ్ర‌యిన మాజీ క్రికెటర్ యువ‌రాజ్ సింగ్‌.. మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచ్చిన యువీ భార్య హేజ‌ల్ కీచ్‌..!

Yuvraj Singh : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ తండ్ర‌య్యాడు. ఆయ‌న భార్య హేజ‌ల్ కీచ్ మ‌గ శిశువుకు జన్మ‌నిచ్చింది. ఈ మేర‌కు ఈ దంప‌తులు ఈ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. త‌మ‌కు మ‌గ శిశువు జ‌న్మించాడ‌ని వారు త‌మ సోష‌ల్ ఖాతాల ద్వారా వెల్ల‌డించారు.

Yuvraj Singh become father his wife hazel keech delivered baby boy

మాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం.. అని యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు. ఇక ఇదే పోస్టును హెజల్‌ కీచ్ కూడా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.

బ్రిటిష్‌-మారిషియస్‌ నటి, మోడల్‌ అయిన హేజల్‌ కీచ్‌ను 2016లో యువరాజ్‌ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవలే వీరు తమ 5వ‌ వివాహ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జరుపుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు శిశువు జ‌న్మించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని ఈ దంప‌తులు తెలిపారు.

ఇక క్రికెట్ ప్ర‌పంచంలో యువ‌రాజ్ సింగ్ యువీగా ఎంతో రాణించాడు. 2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. చాలా త‌క్కువ కాలంలోనే స్టార్ ఆల్ రౌండ‌ర్‌గా మారాడు. భార‌త్ కు అనేక మ్యాచ్‌ల‌లో విజ‌యాల‌ను అందించాడు.

యువీ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ సత్తాచాటి ఓ ద‌శ‌లో మేటి ఆలౌరౌండర్‌గా గుర్తింపు పొందాడు. కాగా భారత్‌ తరఫున యువీ 304 వన్డేలు, 40 టెస్ట్‌లు, 58 టీ20లు ఆడాడు. భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌లు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే 2019 జూన్‌ 10న అన్ని ఫార్మాట్ల నుంచి వైదులుగొతున్నట్లు యువీ ప్రకటించాడు. దాదాపుగా యువీ 19 ఏళ్లపాటు క్రికెట్ ఆడాడు. ఐపీఎల్‌లోనూ ప‌లు జ‌ట్ల త‌ర‌ఫున యువీ ఆడాడు. కానీ పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. క్యాన్స‌ర్‌ను విజ‌య‌వంతంగా ఎదుర్కొన్న వ్య‌క్తిగా యువీ అంద‌రి ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి