గురువారం, జూన్ 11, 2026
స్నాక్స్

రుచికరమైన మరమరాల కట్లెట్ ఎలా తయారు చేయాలంటే ?

పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ లో మరమరాల కట్లెట్ ఒకటి అని చెప్పవచ్చు. మరి మరమరాల కట్లెట్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు *మరమరాలు రెండు కప్పులు…

రుచికరమైన మరమరాల కట్లెట్ ఎలా తయారు చేయాలంటే ?

పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ లో మరమరాల కట్లెట్ ఒకటి అని చెప్పవచ్చు. మరి మరమరాల కట్లెట్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*మరమరాలు రెండు కప్పులు

*క్యారెట్ తురుము అరకప్పు

*బంగాళాదుంప గుజ్జు పావు కప్పు

*గరంమసాలా టేబుల్ స్పూన్

*ఉల్లిపాయ ముక్కలు గుప్పెడు

*పచ్చిమిర్చి 2

*కోడిగుడ్డు ఒకటి

*చీజ్ తురుము రెండు టేబుల్ స్పూన్లు

*బ్రెడ్ పౌడర్ అర కప్పు

*ఉప్పు తగినంత

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోకి క్యారెట్ తురుము, గరం మసాలా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఈ మిశ్రమం చల్లారిన తరవాత బంగాళదుంప గుజ్జు అప్పుడే నీటిలో నానబెట్టుకున్న మరమరాలు, చీజ్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజులో తయారు చేసుకొని వాటిని గుడ్డు మిశ్రమంలో అద్ది బ్రెడ్ పౌడర్ లో అటు ఇటు తిప్పుతూ నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన మరమరాల తయారైనట్లే.వేడి వేడిగా ఉండే మరమరాల కట్లెట్ టమోటో సాస్ తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి