గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Brinjal : ఆప‌రేష‌న్ చేయించుకున్న‌వాళ్లు వంకాయ తిన‌కూడ‌దా.. డాక్ట‌ర్లు అలా ఎందుకు చెబుతారు..?

Brinjal : ఆపరేషన్ చేయించు కోవాల్సినప్పుడు, సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకొవ్వరు వైద్యులు. ఆహారమే కాదు.. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు…

Brinjal : ఆప‌రేష‌న్ చేయించుకున్న‌వాళ్లు వంకాయ తిన‌కూడ‌దా.. డాక్ట‌ర్లు అలా ఎందుకు చెబుతారు..?

Brinjal : ఆపరేషన్ చేయించు కోవాల్సినప్పుడు, సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకొవ్వరు వైద్యులు. ఆహారమే కాదు.. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు. సర్జరీ చేయించుకున్న తర్వాత క‌చ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు. అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఏ వైద్యుడు అయినా సర్జరీ చేసే ముందు మ‌త్తు మందును పేషెంట్ కు ఇస్తారు. దీనివల్ల మ‌త్తు కలిగి పేషెంట్ నిద్రపోతాడు. ఆ సమయంలో సర్జరీ చేయడం వలన ఎలాంటి నొప్పి తెలియకుండా ఉంటుంది. అయితే ఇలా మ‌త్తు మందును ఇవ్వడం వల్ల శరీరంలో జీవక్రియల‌కు ఆటంకం ఏర్పడుతుంది. శరీరం ఒక‌లాంటి కోమా స్థితిలోకి వెళ్తుంది. దీని వల్ల అన్ని అవయవాలు స్తబ్దుగా అయిపోతాయి.

why doctors tell to not to eat Brinjal after surgery
Brinjal

తిరిగి వెంటనే అవ‌య‌వాలు పని చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో హిస్టామిన్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిని తగ్గించడం కోసమే యాంటీ హిస్టామిన్ లు మందులను ఇస్తారు. అయితే వంకాయ హిస్టామిన్ ల‌ను విడుదల చేసే పదార్థం. యాంటీ హిస్టామిన్ మందులు వేసుకుంటూ వంకాయ తినడం వలన మందులు పనిచేయవు. అందుకే సర్జరీ సమయంలో వైద్యులు వంకాయ తినకూడద‌ని చెబుతారు. ఇదీ.. దీని వెనుక ఉన్న అస‌లు కార‌ణం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి