Viral News : ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది భిన్న రకాల ఉద్యోగాలను, వ్యాపారాలను చేస్తుంటారు. అయితే కొందరు చేసే వ్యాపారాలు మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ కూడా ఇలాగే వింతైన వ్యాపారం చేసింది. కానీ అది ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అమెరికాకు చెందిన టీవీ నటి స్టెఫనీ మాటో ఓ వైపు నటిగా చేస్తూనే మరో వైపు సైడ్ బిజినెస్ ప్రారంభించింది. అదేమిటంటే.. తనకు గ్యాస్ సమస్య బాగా ఉంది కనుక.. అపాన వాయువు వస్తుంటుంది. దీంతో ఆమె ఆ వాయువును సీసాలో బంధించి అమ్మడం మొదలు పెట్టింది.
అలా ఆమె ఒక సీసాలో కొన్ని సార్లు అపాన వాయువును నింపి ఒక్క సీసాను 1000 డాలర్లకు (సుమారుగా రూ.74వేలకు) విక్రయిస్తుండేది. ఈ క్రమంలోనే ఆమె వారానికి 50 సీసాలను అమ్ముతుండేది. దీంతో ఆమెకు వారానికి దాదాపుగా రూ.37 లక్షలు వచ్చేవి.
అయితే అత్యాశకు పోయిన స్టెఫనీ మరింత డబ్బు సంపాదించేందుకు గాను ఓ పనిచేసింది. అపాన వాయువు ఇంకా ఎక్కువగా వచ్చేందుకు ప్రోటీన్లను, సోయా ప్రొడక్ట్స్‌ను ఎక్కువగా తీసుకుంది. అయితే ఆమెకు గ్యాస్ ట్రబుల్ సమస్య ఎక్కువైంది. ఓ దశలో అది ఆమె గుండెకు ముప్పుగా మారింది. దీంతో ఆమె వెంటనే హాస్పిటల్‌లో చేరి చికిత్సను తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అలా ఆమె ఉన్నదాంతో సరిపెట్టుకోక అత్యాశకు పోయింది. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అయినప్పటికీ అదృష్టం బాగుండడంతో బతికి బయట పడింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…