Golden Sweets : స్వీట్లు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది భిన్న రకాల స్వీట్లను తింటుంటారు. అయితే బంగారం పూత పూసిన స్వీట్లను మీరు ఎప్పుడైనా తిన్నారా ? ఏంటీ.. బంగారం పూత పూసిన స్వీట్లా.. అని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. అవును నిజమే.
సహజంగానే స్వీట్లపై సిల్వర్ ఫాయిల్‌ను వేసి అమ్ముతుంటారు. వాటిని మనం చూస్తుంటాం. అయితే ఢిల్లీలోని ఓ స్వీట్‌షాప్ వారు మాత్రం సిల్వర్ ఫాయిల్‌కు బదులుగా బంగారం పూతను వేసి స్వీట్లను విక్రయిస్తున్నారు. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఉన్న షగున్ స్వీట్స్ అనే షాపుకు చెందిన వారు స్వీట్లపై బంగారం పూత వేసి విక్రయిస్తున్నారు.
ఇక ఈ స్వీట్ల ధర కేజీకి ఏకంగా రూ.16వేల వరకు ఉంది. ఈ క్రమంలో ఈ స్వీట్లకు చెందిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. చాలా మంది ఈ గోల్డ్ స్వీట్‌కు ఆకర్షితులవుతున్నారు. తాము ఈ స్వీట్‌ను రుచి చూడాలనుకుంటున్నామని కొందరు కామెంట్లు చేయగా.. అసలు దీన్ని తినగలమా.. అంత ఖరీదు పెట్టి కొనగలమా.. అంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 13.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 6.66 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మందిని ఈ స్వీట్ ఆకట్టుకుంటోంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…