Golden Sweets : బాప్‌రే.. బంగారం పూత వేసిన స్వీట్‌.. ధ‌ర ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

January 7, 2022 4:47 PM

Golden Sweets : స్వీట్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది భిన్న ర‌కాల స్వీట్ల‌ను తింటుంటారు. అయితే బంగారం పూత పూసిన స్వీట్ల‌ను మీరు ఎప్పుడైనా తిన్నారా ? ఏంటీ.. బంగారం పూత పూసిన స్వీట్లా.. అని మీరు ఆశ్చర్య‌పోతుండ‌వ‌చ్చు. అవును నిజ‌మే.

Golden Sweets are sold in Delhi you will be shocked to know the price

స‌హ‌జంగానే స్వీట్ల‌పై సిల్వ‌ర్ ఫాయిల్‌ను వేసి అమ్ముతుంటారు. వాటిని మ‌నం చూస్తుంటాం. అయితే ఢిల్లీలోని ఓ స్వీట్‌షాప్ వారు మాత్రం సిల్వ‌ర్ ఫాయిల్‌కు బ‌దులుగా బంగారం పూత‌ను వేసి స్వీట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఉన్న ష‌గున్ స్వీట్స్ అనే షాపుకు చెందిన వారు స్వీట్ల‌పై బంగారం పూత వేసి విక్ర‌యిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Arjun Chauhan ? (@oye.foodieee)

ఇక ఈ స్వీట్ల ధ‌ర కేజీకి ఏకంగా రూ.16వేల వ‌ర‌కు ఉంది. ఈ క్ర‌మంలో ఈ స్వీట్ల‌కు చెందిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. చాలా మంది ఈ గోల్డ్ స్వీట్‌కు ఆక‌ర్షితుల‌వుతున్నారు. తాము ఈ స్వీట్‌ను రుచి చూడాలనుకుంటున్నామ‌ని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. అస‌లు దీన్ని తిన‌గ‌ల‌మా.. అంత ఖ‌రీదు పెట్టి కొన‌గ‌ల‌మా.. అంటూ కొంద‌రు కామెంట్లు చేశారు. ఈ వీడియోకు ఇప్ప‌టికే 13.1 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 6.66 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. చాలా మందిని ఈ స్వీట్ ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now