Viral News : అపాన వాయువును అమ్ముతూ వ్యాపారం చేసింది.. చివ‌ర‌కు హాస్పిట‌ల్ పాలైంది..

January 7, 2022 6:25 PM

Viral News : ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది భిన్న ర‌కాల ఉద్యోగాల‌ను, వ్యాపారాల‌ను చేస్తుంటారు. అయితే కొంద‌రు చేసే వ్యాపారాలు మాత్రం మ‌న‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఓ మ‌హిళ కూడా ఇలాగే వింతైన వ్యాపారం చేసింది. కానీ అది ఆమె ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Viral News tv actress stephanie matto hospitalized with severe gas trouble

అమెరికాకు చెందిన టీవీ న‌టి స్టెఫ‌నీ మాటో ఓ వైపు న‌టిగా చేస్తూనే మ‌రో వైపు సైడ్ బిజినెస్ ప్రారంభించింది. అదేమిటంటే.. త‌న‌కు గ్యాస్ స‌మ‌స్య బాగా ఉంది క‌నుక‌.. అపాన వాయువు వ‌స్తుంటుంది. దీంతో ఆమె ఆ వాయువును సీసాలో బంధించి అమ్మ‌డం మొద‌లు పెట్టింది.

అలా ఆమె ఒక సీసాలో కొన్ని సార్లు అపాన వాయువును నింపి ఒక్క సీసాను 1000 డాల‌ర్ల‌కు (సుమారుగా రూ.74వేలకు) విక్ర‌యిస్తుండేది. ఈ క్ర‌మంలోనే ఆమె వారానికి 50 సీసాల‌ను అమ్ముతుండేది. దీంతో ఆమెకు వారానికి దాదాపుగా రూ.37 ల‌క్ష‌లు వ‌చ్చేవి.

అయితే అత్యాశ‌కు పోయిన స్టెఫ‌నీ మ‌రింత డ‌బ్బు సంపాదించేందుకు గాను ఓ ప‌నిచేసింది. అపాన వాయువు ఇంకా ఎక్కువ‌గా వ‌చ్చేందుకు ప్రోటీన్ల‌ను, సోయా ప్రొడ‌క్ట్స్‌ను ఎక్కువ‌గా తీసుకుంది. అయితే ఆమెకు గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య ఎక్కువైంది. ఓ ద‌శ‌లో అది ఆమె గుండెకు ముప్పుగా మారింది. దీంతో ఆమె వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స‌ను తీసుకుంటోంది. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి బాగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. అలా ఆమె ఉన్న‌దాంతో స‌రిపెట్టుకోక అత్యాశ‌కు పోయింది. చివ‌ర‌కు ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది. అయిన‌ప్ప‌టికీ అదృష్టం బాగుండ‌డంతో బ‌తికి బ‌య‌ట ప‌డింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now