Fish : అదృష్టం త‌లుపు త‌ట్టింది.. ఆ చేప‌ల‌ను ప‌ట్టి అత‌ను రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు అయ్యాడు..!

January 30, 2022 7:22 PM

Fish : అదృష్టం అనేది ఎవ‌రినీ అంత సుల‌భంగా వ‌రించ‌దు. వరిస్తే మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అవుతారు. అవును.. ఇలాంటి సంఘ‌ట‌న‌ల గురించి గ‌తంలో మ‌నం అనేక సార్లు చ‌దివాం. కోల్‌క‌తాలోనూ తాజాగా ఇలాంటిదే ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

man caught telia bhola Fish and become millionaire over night
Fish

కోల్‌క‌తాలోని తూర్పు మిడ్నపూర్ లో ఉన్న దిఘా అనే ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు మనోరంజన్ ఖండాకు అరుదైన చేప‌లు ల‌భించాయి. గ‌త శ‌నివారం ఆయ‌న, ఇంకొంద‌రు మ‌త్స్య‌కారులు క‌లిసి చేప‌ల‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే వారికి అత్యంత అరుదైన “తేలియా భోలా” చేప‌లు చిక్కాయి. మొత్తం 121 చేప‌లు వ‌ల‌లో ప‌డ్డాయి. వాటిని అక్క‌డి మోహ‌న చేప‌ల మార్కెట్‌లో విక్ర‌యించాడు. దీంతో అత‌నికి రూ.2 కోట్లు వ‌చ్చాయి. అలా అత‌ను రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు అయ్యాడు.

తేలియా భోలా చేప‌లు అత్యంత అరుదైన‌వి. అవి ఎప్పుడో ఒకసారి గానీ వ‌ల‌లో ప‌డ‌వు. ఈ క్ర‌మంలో మ‌నోరంజ‌న్‌ను చేప‌లు అదృష్టం రూపంలో వ‌రించాయి. ఏకంగా 121 చేప‌లు వ‌ల‌లో ప‌డ‌డంతో అత‌ని పంట పండింది. ఈ చేప‌ల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటి లివ‌ర్‌లోని ఆయిల్ నుంచి ప‌లు ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. అలాగే ఈ చేప‌ల చ‌ర్మానికి సైతం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ‌. వీటి చ‌ర్మం కేజీకి రూ.85వేల మేర ఉంటుంది. అందుక‌నే ఈ చేప‌లు అంత ధ‌ర ప‌లుకుతుంటాయి. ఏది ఏమైనా.. మ‌నోరంజ‌న్‌ను మాత్రం ఆ చేప‌లు అదృష్టంలా వ‌రించాయి. వాటితో అత‌ను రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు అయ్యాడు. క‌రోనా స‌మ‌యంలో త‌మ‌కు చాలా న‌ష్టాలు వ‌చ్చాయ‌ని, ఈ దెబ్బ‌తో ఆ న‌ష్టాల‌న్నింటినీ భ‌ర్తీ చేసుకోగ‌లిగాన‌ని.. మ‌నోరంజ‌న్ తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now