Viral News : పెళ్లి ఇంకొన్ని నిమిషాల‌న‌గా వ‌రుడి విగ్ ఊడింది.. వ‌ధువు ఏం చేసిందంటే..?

May 23, 2022 8:19 PM

Viral News : వేయి అబ‌ద్దాలు ఆడి అయినా స‌రే ఒక పెళ్లి చేయాల‌ని అంటారు. అయితే పెళ్లి చేసేందుకు అబ‌ద్దాలు ఆడ‌వ‌చ్చు.. కానీ అవి షాక్‌కు గురి చేసే అబద్ధాలు అయి ఉండ‌కూడ‌దు. అలాంటి అబ‌ద్ధాలు ఆడితే ఆ పెళ్లిళ్లు జ‌ర‌గ‌వు. మ‌ధ్య‌లోనే ఆగిపోతాయి. ఇలాంటి పెళ్లిళ్లు ఎన్నింటినో మ‌నం మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డాన్ని చూశాం. ఇక స‌రిగ్గా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ చోటు చేసుకుంది. స‌రిగ్గా పెళ్లి మండ‌పం వ‌ద్ద‌కు వెళ్లి కూర్చుంటే ఇంకొద్ది నిమిషాల్లో పెళ్లి జ‌రుగుతుంది అన‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో పెళ్లి కూతురు త‌నకు పెళ్లి వ‌ద్ద‌ని అక్క‌డి నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో సైతం వైర‌ల్ అవుతోంది. అస‌లు ఏం జరిగింది.. అన్న విష‌యానికి వ‌స్తే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఉన్నావ్ అనే ప్రాంతంలో ఓ చోట పెళ్లి జ‌రుగుతోంది. ముందు రోజు అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేశారు. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే పెళ్లి జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే పెళ్లి కొడుకు మండ‌పం వ‌ద్ద‌కు చేరుకుని దాన్ని ఎక్కే క్ర‌మంలో స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. దీంతో అత‌ను ధ‌రించిన విగ్ ఒక్క‌సారిగా ఊడిపోయింది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న పెళ్లి కూతురు ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. దీంతో ఆమె వెంట‌నే పెళ్లిని ర‌ద్దు చేసుకుంది. త‌న‌కు పెళ్లి వ‌ద్దంటే వ‌ద్ద‌ని ఖ‌రాఖండిగా చెప్పేసింది.

Viral News groom wig fallen before marriage
Viral News

అయితే పెద్ద‌లు పంచాయ‌తీ పెట్టి ఆ వ‌ధువుకు న‌చ్చజెప్పాల‌ని చూశారు. కానీ ఆమె వినిపించుకోలేదు. త‌న‌కు బ‌ట్ట‌త‌ల ఉన్న వ్య‌క్తి భ‌ర్త‌గా వ‌ద్ద‌ని ఆమె చెప్పింది. దీంతో పెళ్లి కోసం వారు పెట్టిన రూ.5.66 ల‌క్ష‌ల ఖ‌ర్చును వ‌రుడి కుటుంబం వెన‌క్కి ఇచ్చేయాల‌ని తీర్మానించారు. అయితే అంత‌టితో వ‌ధువు ఆగ‌లేదు. వ‌రుడిపై చీటింగ్ కేసు పెట్టింది. ఈ క్ర‌మంలోనే పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment