Viral News : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. ఆమె బ‌తికుండ‌గానే తండ్రి పిండం పెట్టాడు.. చ‌నిపోయింద‌ని ప్ర‌క‌టించేశాడు..

January 18, 2022 6:17 PM

Viral News : ఆ తండ్రి త‌న కుమార్తెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కానీ ఆమె మాత్రం తండ్రిని ఎదిరించి, కుటుంబ స‌భ్యుల‌ను కాద‌ని ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమె బ‌తికుండ‌గానే ఆ తండ్రి పిండం పెట్టాడు. త‌న కుమార్తు చ‌నిపోయింద‌ని క‌ర్మ చేశాడు. ఈ షాకింగ్ సంఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Viral News man did final rites to her daughter for marrying a person

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి, అదే గ్రామానికి చెందిన‌ వెంకటేష్ అనే యువకుడు స్నేహితులుగా ఉంటూనే ప్రేమ‌లో ప‌డ్డారు. దీంతో వారు పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. ఇదే విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌గా వారు అంగీక‌రించ‌లేదు. దీంతో వారు త‌మ త‌ల్లిదండ్రుల‌ను ఎదిరించి, వారిని కాద‌ని చెప్పి ఈ నెల 13వ తేదీన ఓ ఆల‌యంలో వివాహం చేసుకున్నారు. అయితే త‌మ‌ను కాద‌ని చెప్పి త‌మ కుమార్తె అలా ప్రేమ వివాహం చేసుకోవ‌డాన్ని ఎంత మాత్రం భ‌రించ‌లేని ఆ తండ్రి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. త‌మ కుమార్తె బ‌తికి ఉండ‌గానే చ‌నిపోయింద‌ని ప్ర‌క‌టించాడు. అంతేకాదు ఆమెకు క‌ర్మ‌కాండ‌లు చేశాడు.

అలా ఆ తండ్రి త‌న కుమార్తె చిత్ర‌ప‌టానికి పూలమాల‌లు వేసి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించాడు. అనంత‌రం గుండు గీయించుకున్నాడు. ఆమె బ‌తికి ఉండ‌గానే ఆమెకు పిండ ప్ర‌దానం చేశాడు. అయితే ఈ వార్త సోష‌ల్ మీడియాలో సైతం వైర‌ల్‌గా మారింది. ఇక ఈ వార్త‌కు సంబంధించి ఇంకో విష‌యం కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

త‌మ కుమార్తె ఇష్టం మేర‌కు వివాహం జ‌రిపిస్తాన‌ని ఆమె తండ్రి చెప్పినా ఆ యువ‌కుడు విన‌లేద‌ని, దీంతో వారు వివాహం చేసుకున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే త‌న‌ను కాద‌ని చెప్పి అలా పెళ్లి చేసుకుంద‌నే కోపంతో ఆ తండ్రి ఈ విధంగా చేశాడ‌ని అంటున్నారు. ఈ విష‌యం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now